అందాల తార సన్నీలియోన్ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ ముద్దుగుమ్మ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇక సన్నీ నటిస్తున్న నయా మూవీ ‘కొటేషన్ గ్యాంగ్’ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా కోసం సన్నీ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడూ గ్లామర్ గర్ల్‌గా కనిపించే సన్నీలియోన్ ఈ సినిమాలో ఘాటైన పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రాన్ని ముందుగా జూలైలో విడుదల చేయాలని భావించగా, ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారింది.
సన్నీ లియోన్ తన సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రక్తంతో తడిసిన మోషన్ పోస్టర్‌ను కూడా సన్నీ షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది.. “కొటేషన్ గ్యాంగ్ ఆగస్ట్ 30న థియేటర్లలోకి రాబోతోందని ప్రకటించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మరిచిపోలేని సినిమా అనుభవం కోసం సిద్ధంగా ఉండండి” అని తెలిపింది .ఆగస్ట్ 30న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొటేషన్ గ్యాంగ్ లో ఆమెతో పాటు జాకీ ష్రాఫ్, ప్రియమణి, సారా అర్జున్, జైప్రకాష్, అష్రఫ్ మలిస్సేరి, సోనాల్ ఖిల్వానీ వంటి నటీనటులు కనిపించనున్నారు. ఈ సినిమాలో సన్నీ తొలిసారి డార్క్ రోల్ చేయబోతోంది. ఈ చిత్రానికి వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ముంబైతో పాటు చెన్నై, కాశ్మీర్‌లో ఈమూవీ షూటింగ్ జరుపుకుంది.
ఈ చిత్రంలో సన్నీలియోన్ భయంకరమైన హంతకురాలిగా నటిస్తోంది. ఆమె డబ్బు కోసం ప్రజలను దారుణంగా హత్య చేసే కాంట్రాక్ట్ కిల్లింగ్ ముఠాలో భాగం. జూన్ ప్రారంభంలో, సన్నీ తన ఇంటెన్స్ లుక్‌తో సినిమా పోస్ట్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో జాకీ ష్రాఫ్, ప్రియమణి కూడా కనిపిస్తున్నారు. ఆ సమయంలో సినిమాను జులైలో విడుదల చేస్తామని చెప్పారు. అయితే జులై ముగియనున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎలాంటి వార్త రాలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి