71st National Film Awards: మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు.. సుకుమార్ కూతురు సుకృతి గురించి ఈ విషయాలు తెలుసా?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – తబిత దంపతులకు ఇద్దరు సంతానం. కూతురి పేరు సుకృతి వేణి కాగా కుమారుడి పేరు సుక్రాంత్. వీరిలో సుకృతి తండ్రి అడుగు జాడల్లోనే పయనిస్తోంది. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనను కనబర్చింది. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డుకు ఎంపికైంది.

71st National Film Awards:  మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు.. సుకుమార్ కూతురు సుకృతి గురించి ఈ విషయాలు తెలుసా?
71st National Film Awards

Updated on: Aug 01, 2025 | 9:13 PM

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రకటించింది. శుక్రవారం (ఆగస్టు 01) సాయంత్రం ప్రకటించిన ఈ పురస్కారాల్లో తెలుగు సినిమాలు, నటులు సత్తా చాటారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరిని అవార్డు నిలిచింది. ఉత్తమ యాక్షన్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ)లో ‘హను-మాన్‌’ చిత్రం అవార్డు దక్కించుకోగా, ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’లో ‘ఊరు పల్లెటూరు’ పాటకు గానూ కాసర్ల శ్యామ్‌ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. వీరితో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్ అవార్డుకు ఎంపికైంది. గాంధీ తాత చెట్టు సినిమాకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. మల్లాది పద్మావతి తెరకెక్కించిన ఈ సినిమాలో సుకృతి వేణితో పాటు ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యెర్నేని నవీన్, రవిశంకర్ ఈమూవీని నిర్మించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన గాంధీ తాత చెట్టు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా మొదటి సినిమా అయినా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది సుకుమార్ కూతురు సుకృతి. ఈ సినిమా కోసం గుండు కూడా చేయించుకుందీ స్టార్ కిడ్.

‘ గాంధీజీ సిద్ధాంతాల్ని పాటించే ఓ పదమూడేళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథతో గాంధీ తాత చెట్టు సినిమా తెరకెక్కింది. తన గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ అమ్మాయి ఏం చేసిందనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు మల్లాది పద్మావతి. రిలీజ్ కు ముందే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఎంపికైంది. అలాగే ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా అవార్డు అందుకోనుంది. దీంతో సుకుమార్ కూతురిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

భార్య, పిల్లలతో డైరెక్టర్ సుకుమార్..

కాగా గాంధీ తాత చెట్టు అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సుకుమారి కూతురు యాక్టింగ్ చూడాలనుకునేవారు ఈ మూవీపై ఓ లుక్కేసుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి