
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్న హీరో సుహాస్. విభిన్నమైన కంటెంట్.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుహాస్.. కొద్ది రోజుల క్రితమే ప్రసన్న వదనం సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. మే 3న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలరించాయని.. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయిందని అడియన్స్ న్నారు. సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మరోసారి తనదైన సహజ నటనతో ప్రశంసలు అందుకున్నాడు సుహాస్. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుని ప్రాఫిట్ కూడా తీసుకువచ్చిందని మేకర్స్ వెల్లడించారు.
ఇక థియేటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుందని తెలుస్తుంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఈ మూవీ డిజిటిల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసినట్లు సమాచారం. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రాన్ని నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్. అయితే ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తెలియరాలేదు. కానీ మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తుంది.
ఈ చిత్రాన్ని డైరెక్టర్ అరుణ్ వైకే తెరకెక్కించారు. చాలాకాలంగా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అరుణ్.. ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యారు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ జేఎస్, ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటించారు.
Get into the vibe and cherish your memories while grooving to #PoPo🕺✨#PoPo video song out now 🤩
Book your tickets for #PrasannaVadanam today 💥
🎟️ https://t.co/WTLLHYH2cY@ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @ReddyPrasadLTC… pic.twitter.com/ACbwaT24mO— BA Raju’s Team (@baraju_SuperHit) May 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.