
సుడిగాలి సుధీర్..ఈ పేరుకు బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా గతేడాది సినిమాతో హీరోగా మారాడు సుధీర్. ఈ చిత్రాన్ని రాజశేకర్ రెడ్డి పులిచర్ల తెరకెక్కించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో మరో చిత్రం రూపొందబోతుంది. అంజన్ బాబు నిర్మించనున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “కమర్షియల్ అంశాలతో పాటు, చక్కటి వినోదాత్మక ప్రేమ కథతో సినిమాని రూపొందిస్తున్నాం. సప్తగిరి స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. యువతను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉంటాయి” అని తెలిపారు. ఈ సినిమాకి చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read :