Mahesh Babu: ఆకాశం నీ హద్దురా దర్శకురాలితో సూపర్ స్టార్ మహేష్ సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.

Mahesh Babu: ఆకాశం నీ హద్దురా దర్శకురాలితో సూపర్ స్టార్ మహేష్ సినిమా
Mahesh Babu

Edited By:

Updated on: Apr 22, 2021 | 8:17 AM

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులంతా సర్కారు వారి పాట కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నరు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసినా పోస్టర్స్ లో మహేష్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన మహేష్ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే..

తాజాగా మహేష్  సుధ కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. దర్శకురాలిగా తమిళంలో సుధా కొంగరకి మంచి పేరు ఉంది. ఇటీవల తమిళంలో సూర్య హీరోగా ఆమె తెరకెక్కించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా విజయంతో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది. అలాంటి ఆమె ఇటీవల మహేశ్ బాబును కలిసి ఒక కథ వినిపించారట. ఆ కథలోని కొత్తదనం నచ్చడంతో వెంటనే ఆయన ఓకే చెప్పాడని అంటున్నారు. ఇక సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. త్రివిక్రమ్ సినిమా తర్వాత ఈ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Shruti Haasan: ప్రభాస్ సలార్ సినిమాలో శృతిహాసన్ ఆ రోల్ లో కనిపించనుందట..!

Mahesh Babu: భారీగా నమోదువ్వుతున్న కేసులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన మహేష్ బాబు