Rakesh Master: దివంగత రాకేష్‌ మాస్టర్‌కు విగ్రహం.. త్వరలోనే ఆవిష్కరణ.. ఎవరు తయారుచేయిస్తున్నారో తెలుసా?

ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌, టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ మరణం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. సుమారు 1500 సినిమాలకు డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేశారాయన. అలాగే సత్య, జానీ, శేఖర్‌ మాస్టర్ల లాంటి స్టార్‌ కొరియోగ్రాఫర్లను తీర్చిదిద్ది ఇండస్ట్రీకి అందించారు. ఒకొనాక దశలో టాలీవుడ్‌ టాప్‌ కొరియోగ్రాఫర్‌గా వెలిగిన ఆయన కొన్ని కారణాలతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Rakesh Master: దివంగత రాకేష్‌ మాస్టర్‌కు విగ్రహం.. త్వరలోనే ఆవిష్కరణ.. ఎవరు తయారుచేయిస్తున్నారో తెలుసా?
Rakesh Master

Updated on: Aug 04, 2023 | 4:51 PM

ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌, టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ మరణం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. సుమారు 1500 సినిమాలకు డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేశారాయన. అలాగే సత్య, జానీ, శేఖర్‌ మాస్టర్ల లాంటి స్టార్‌ కొరియోగ్రాఫర్లను తీర్చిదిద్ది ఇండస్ట్రీకి అందించారు. ఒకొనాక దశలో టాలీవుడ్‌ టాప్‌ కొరియోగ్రాఫర్‌గా వెలిగిన ఆయన కొన్ని కారణాలతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర అనారోగ్యానికి గురై జూన్ 18న తుదిశ్వాస విడిచారు. రాకేష్‌ మాస్టర్‌ అకాల మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, శిష్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. తమ గురుభక్తిని చాటుకుంటూ జానీ, శేఖర్‌ మాస్టర్లు రాకేష్‌ మాస్టర్‌ పాడెను మోశారు. ఆతర్వాత కూడా సంస్మరణ సభ కూడా నిర్వహించారు. అందులో రాకేష్‌ మాస్టర్‌ అంటే తమకెంతో ప్రత్యేకమో మరోసారి గుర్తుచేసుకున్నారు. ఇదిలా ఉంటే రాకేష్‌ మాస్టర్‌ అందించిన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. రాకేశ్‌ మాస్టర్‌కు అత్యంత సన్నిహితుడు, తన ఆఖరి శ్వాస వరకు పక్కనే ఉండి అన్నీ చూసుకున్న ఆలేటి ఆటం ఈ విగ్రహాన్ని సొంత ఖర్చులతో దగ్గరుండి తయారు చేయిస్తున్నారు. హైదరాబాద్‌లోనే మాస్టర్‌ విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంటోంది.

నెటిజన్ల కామెంట్లు..

ఓ డ్యాన్స్‌ రియాలిటీ షోలో వైష్ణవుడిగా కనిపించి ఆకట్టుకున్నారు డ్యాన్స్‌ మాస్టర్‌. ఈ పాత్ర చాలామందికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడీ వైష్ణువడి వేషధారణలోనే రాకేష్‌ మాస్టర్‌ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. సుమారు 11 అడుగుల విగ్రహాన్ని సొంత డబ్బుతోనే రెడీ చేయిస్తున్నారు ఆలేటీ ఆలం. కాగా డ్యాన్స్‌ మాస్టర్‌ విగ్రహం విశేషాలను ఆయన శిష్యుడు కొరియోగ్రాఫర్ బషీర్ సోషల్ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో రెండు వీడియోలను పంచుకున్నారు బషీర్‌. అందులో రాకేష్‌ మాస్టర్‌ విగ్రహం ఎలా ఉంటుందో క్లియర్‌గా చూపించాడు. ‘రాకేష మాస్టర్‌ విగ్రహం మొత్తం ఖర్చును ఆలేటీ భరిస్తున్నారు. త్వరలో ఈ విగ్రహం ఓపెనింగ్ జరగనుంది. మాస్టర్‌ ఎక్కడన్నా.. మా మనస్సుల్లోనే ఉంటారు’ అని బషీర్‌ చెప్పుకొచ్చారు. అలాగే విగ్రహ నిర్మాణంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని అభిమానులు, నెటిజన్లను సూచించారు. ఈక్రమంలో కొందరు రాకేష్‌ మాస్టర్‌ విగ్రహ నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు అది చూడడానికి రాకేష్‌ మాస్టర్‌ విగ్రహంలా లేడని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

రాకేష్ మాస్టర్ విగ్రహం వీడియోలు..

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..