సెలబ్రిటీల జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా పాష్ గా ఉంటుంది. కాస్ట్లీ కార్లు, విలాసవంతమైన బంగ్లాలు. ఖరీదైనబట్టలు. ఎప్పుడూ విదేశాల ప్రయాణం ఇలా చాలా రిచ్ గా ఉంటుంది. ప్రతి సెలబ్రిటీ దగ్గర కోటి రూపాయల విలువైన కారు ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతుంటారు. కాస్ట్లీ కారులు ఉన్న ఆటోల్లో తిరుగుతూ కనిపిస్తారు. అలాగే సింపుల్ డ్రస్ లు వేసుకుంటూ ఉంటారు. తాజగా ఓ సెలబ్రెటీ ఇలా రోడ్డు మీద స్కూటీ వేసుకుతిరుగుతూ కనిపించాడు. అతన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. కోట్లు సంపాదిస్తున్న అతను ఇలా సింపుల్ గా సామాన్యుడిగా రోడ్లపై తిరగడం చూసి అందరూ అవాక్ అవుతున్నారు. ఇంతకూ అతను ఎవరో గుర్తుపట్టారా.? అతని గాత్రానికి లక్షలమంది అభిమానులు ఉన్నారు. అతను ఏ పాట ఆలపించినా అది సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం. అతను మరెవరో కాదు..
గాయకుడు అరిజిత్ సింగ్ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు. అలాగే అతను ఎంతో మందికి ఫేవరెట్ సింగర్ కూడా. స్టార్ హీరోలు కూడా అతని పాటలు ఫ్యాన్స్ అవుతారు. అయితే అరిజిత్ సింగ్ చాలా సింపుల్ గా ఉంటాడు. కోటి రూపాయలు పెట్టి కారులు కొన్నా కూడా ఆయన ఎక్కువగా తిరగడానికి స్కూటీ ఉపయోగిస్తాడు. బాలీవుడ్‌లో అరిజిత్ సింగ్‌కు మంచి డిమాండ్ ఉంది.
తాజాగా అరిజిత్ సింగ్ స్కూటీ పై తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను ఎక్కివగా తిరగడానికి స్కూటీను ఉపయోగించడానికి ఇష్టపడతాడు. చాలాసార్లు అరిజిత్ సింగ్ స్కూటీపై కనిపించిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు అరిజిత్ సింగ్ కొత్త వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అరిజిత్ స్కూటీ పై వెళ్తూ.. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వీడియో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఆయన్ను చాలా మంది అభినందిస్తున్నారు. మరికొందరు ఆయన్ను ట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. హెల్మెట్ ఎందుకు ధరించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.