Allu Family: కొణిదెల కుటుంబానికి టాలీవుడ్‌లో ఎంత ప్రాముఖ్యత ఉందో అల్లు వారి కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అల్లు కుటుంబం నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇటు అల్లు కుటుంబం నుంచి కానీ అటు కొణిదెల ఫ్యామిలీ నుంచి కానీ సినిమాల్లోకి వచ్చిన నటీమణులు మాత్రం చాలా తక్కువేనని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం అల్లు ఫ్యామిలీ నుంచి వారసురాలు వెండి తెర ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఆ వారసురాలు ఎవరనేగా..? అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు.. ఇప్పటికే అర్హ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన అల్లరి చేష్టలు, క్యూట్ మాటలతో నెటిజన్లకు ఆకట్టుకుంటోన్న అర్హ వెండి తెర ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ సినిమాలో అర్హను ప్రాధాన్యత ఉన్న పాత్రలో తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథకు అర్హ అయితేనే సరిపోతుందని భావించిన దిల్‌రాజు అల్లు ఫ్యామిలీని ఈ విషయమై సంప్రదించారని.. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Heroine With Mehandi: చేతిలో గొరింటాకు వేసుకొని.. అటుగా తిరిగి ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా.?
Anupama Parameswaran: లవ్ ఫెయిల్ అయ్యిందని షాక్ ఇచ్చిన అనుపమ.. అతడితోనేనా..?