AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్

తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు.. టాలీవుడ్ లోనూ ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఎలాంటి పాత్రలోకైనా పరకాయప్రవేశం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కమల్ హాసన్. రీసెంట్ గా వచ్చిన విక్రమ్ సినిమాతో జారీ విజయాన్ని అందుకున్నారు. కమల్ హాసన్ విక్రమ్ కంటే ముందు సరైన హిట్స్ లేక సతమతం అయ్యారు. కమల్ హాసన్ పని అయిపోయిండి అన్న వారు కూడా ఉన్నారు. కానీ కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో అందరి నోళ్లు మూయించారు.

Kamal Haasan: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్
Kamal Haasan
Rajeev Rayala
|

Updated on: Sep 24, 2023 | 3:27 PM

Share

సినీ ఇండస్ట్రీలో ఆయన చేయనని పాత్ర లేదు, వేయని వేషం లేదు.. ఆయన చూడని సక్సెస్ లేదు.. ఇంతకు ఆయన ఎవరు అంటే .. యూనివర్సల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్. ఇన్నో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పించారు కమల్. తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు.. టాలీవుడ్ లోనూ ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఎలాంటి పాత్రలోకైనా పరకాయప్రవేశం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కమల్ హాసన్. రీసెంట్ గా వచ్చిన విక్రమ్ సినిమాతో జారీ విజయాన్ని అందుకున్నారు. కమల్ హాసన్ విక్రమ్ కంటే ముందు సరైన హిట్స్ లేక సతమతం అయ్యారు. కమల్ హాసన్ పని అయిపోయిండి అన్న వారు కూడా ఉన్నారు. కానీ కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో అందరి నోళ్లు మూయించారు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈసినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆస్కతికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న సమస్యల గురించి.. చేదు అనుభవాల గురించి తెలిపారు. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా..? నా 21-22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా అని అన్నారు.

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక స్టేజ్ లో అవకాశాలు రావడం మానేశాయి. సినిమా  ఛాన్స్ లు రాకపోవడమతొ చాలా బాధపడ్డాను. నా పని అయిపోయిందని అనుకున్నా.. తగిన గుర్తింపు రావడం లేదు అని చాలా ఫీల్ అయ్యాను. అదే సమయంలో చనిపోతే ఎంతో ప్రతిభ ఉన్న నటుడు చనిపోయాడని అందరు అనుకోవాలని ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. ఇదే విషయాన్నీ నా గురువుకు చెప్పాను. అయ్యితే ఆయన నీ పని నువ్వు చేసుకుంటూ పో విజయాలు అవే వెతుకుంటూ వస్తాయి అని అన్నారు. దాంతో నాకు కూడా ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. . హత్య చేయడం ఎంత నేరమో.. ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే నేరం.. జీవితంలో చీకటి ఎప్పటికి ఉండిపోదు.. ఖచ్చితంగా వెలుగు వస్తుంది. అబ్దుల్ కలాం గారు ఓ మాట అన్నారు.. నిద్రపోయేదికాదు కల అంటే మనల్ని నిద్రపోనివ్వకుండా చేసేది కల. చావు అనేది మన జీవితంలో ఓ భాగమే మనం దానికోసం ఎదురుచూడకూడదు అని అన్నారు కమల్ .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.