కేవలం తమ సినిమాలతోనే కాకుండా తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ అభిమానులను అలరిస్తూ ఉంటారు సినిమా తారలు. ఇక వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఏదైనా ఫోటో పోస్ట్ చేస్తే చాలు ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ.. హంగామా చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సతీమణితో కలిసి ఉన్న ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. బ్లూ కరల్ లైటింగ్ లో ఈ జంట కిస్సింగ్ ఫొటో ఒకటి తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న లవ్లీ కపుల్ ఎవరో గుర్తుపట్టారా..? ఈ ఫొటోలోని హీరోకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయన సినిమా రిలీజ్ అయ్యిందంటే అభిమానులకు పండగే.. ఈ హీరో గారి సతీమణి కూడా హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను అలరించారు. ఇంతకు ఈ జంట ఎవరో గుర్తుపట్టారా..?
కేవలం కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ స్టార్ హీరో అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ కుమార్ – షాలిని ఈ ఇద్దరు వెండితెరపై నటులుగా పేరు తెచ్చుకున్నారు. అద్భుతం
అనే మూవీ సమయంలో వీరిద్దరి మద్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అది పెళ్లికి దారి తీసింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ప్రేమ బంధం కాస్తా ఏడడుగులతో పెళ్లి బంధంగా మారింది. పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు దూరమయ్యారు. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ ప్రైవేట్ పార్టీలో తల అజిత్ షాలిని పాల్గొన్నారు. ఆ పార్టీలో షాలినిని హగ్ చేసుకుని అజిత్ కనిపించారు. ఈ ఇద్దరికి సంబంధించిన ఈ తరహా ఫోటోలు ఈమధ్య కాలంలో బయటకురాలేదు. తాజాగా ఈ ఫోటో వైరల్ అవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక అజిత్ నటించిన `వలిమై` ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.