
నటుడు ఆర్. ఆర్ మాధవన్‌కి మంచి క్రేజ్ ఉంది. ఒకానొక సమయంలో లవర్ బాయ్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు మాధవన్. ప్రస్తుతం మాధవన్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇటీవలే ‘షైతాన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటించాడు ఈ స్టార్ హీరో. మాధవన్ కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటాడు. ఇంతవరకూ ఆయన పై ఎలాంటి ట్రోలింగ్ కానీ విమర్శలు కానీ రాలేదు. అయితే ప్రముఖ దర్శకుడు మాధవన్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతనంటే ఇష్టం లేదని ఆ దర్శకుడు అన్నాడట. మాధవన్ ను ప్రతి దర్శకుడు ఇష్టపడతారు. కానీ ఈ దర్శకుడు మాత్రం మాధవన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకు ఆ దర్శకుడు ఎవరు.? ఎందుకు మాధవన్ అంటే అతనికి ఇష్టం లేదు.?
దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాత్రం మాధవన్‌ను చాలా అసహ్యించుకున్నాడు. ఇందుకు గల కారణాన్ని ఆయన వెల్లడించారు. మణిరత్నం ఇటీవలే 68వ ఏట అడుగుపెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి షేర్ చేశారు. అయితే గౌతమ్ మీనన్ గురువు లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం. తన గురువు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2001లో ‘మిన్నలే’ సినిమా విడుదలైంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. అందులో మాధవన్ నటించాడు. ఈ సినిమా స్క్రిప్ట్‌ని మణిరత్నంకు వినిపించాలని దర్శకత్వం చేయించాలని మాధవన్ గౌతమ్ మీనన్ కు చెప్పారట. దీంతో గౌతమ్‌కి కోపం వచ్చింది.
‘మాధవన్ పట్టుబట్టడంతో నా మొదటి సినిమా స్క్రిప్ట్‌ని మణిరత్నంకి వివరించాల్సి వచ్చింది. మాధవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా చేస్తాం అని అన్నారు. ఈ విషయంలో నేను మాధవన్ పై చాలా కోపం వచ్చింది అని గౌతమ్ అన్నారు. అది నిజంగా నాకు అగ్నిపరీక్ష. ఆయన కథ విని ఏమంటారో అని చాలా భయపడ్డాను. నేను మణిరత్నం గారి అభిమానిని. అని గౌతమ్ గత సంఘటను గుర్తు చేసుకున్నారు. అలాగే సినిమా కథ విన్న తర్వాత మణిరత్నంకి ఎలాంటి ఎగ్జైట్‌మెంట్ కలగలేదు. కానీ ఈ సినిమా చేయడానికి మాధవన్ అంగీకరించాడు అని చెప్పారు. ఈ సినిమా 2001లో విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయింది. తెలుగులో చెలి పేరుతో ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత హిందీలోకి ‘రెహనా హై తేరే దిల్ మే’గా రీమేక్ చేశారు. హిందీలోనూ మాధవన్ హీరోగా నటించాడు. ఈ మూవీలో దియా మీర్జా హీరోయిన్ గా నటించింది. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.