
చాలా మంది సినిమా వాళ్ల పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రెటీల పై నెటిజన్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంటారు. సెలబ్రెటీల జీవితంలో ఏది జరిగినా కూడా సోషల్ మీడియాలో దాని పై ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇక చాలా మంది నటీనటులు పలు ఇంటర్వ్యూల్లో కొన్ని షాకింగ్ విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ నటి తన భర్త గురించి చెప్పి ఊహించని షాక్ ఇచ్చింది. తన భర్త గే అని అందర్నీ అవాక్ అయ్యేలా చేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
బాలీవుడ్ లో ఆమె ఓ స్టార్.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు, నిర్మాత, అలాగే నటి ఫరా ఖాన్. ఆమె “మైన్ హూన్ నా”, “ఓం శాంతి ఓం”, “తీస్ మార్ ఖాన్”, “హ్యాపీ న్యూ ఇయర్” వంటి చిత్రాలతో దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. ఫరా ఖాన్ అనేక బాలీవుడ్ చిత్రాలలో 100కి పైగా పాటలకు కొరియోగ్రఫీ చేసింది. అలాగే ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఫరా ఖాన్ షిరీష్ కుందేర్‌ను 2004లో వివాహం చేసుకుంది. వీరు “మైన్ హూన్ నా” చిత్రం సెట్స్‌పై కలుసుకున్నారు,ఆ సినిమాకు షిరీష్ ఎడిటర్‌గా పనిచేశారు. వీరికి 2008లో IVF ద్వారా ముగ్గురు పిల్లలు (ఒక కుమారుడు (సిజార్), ఇద్దరు కుమార్తెలు (అన్యా, దివా)జన్మించారు.
ఫరా ఖాన్ తన భర్త షిరీష్ కుందేర్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అర్చనా పురన్ సింగ్ యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిన చిట్ చాట్ లో మాట్లాడుతూ..షిరీష్‌ను మొదట కలిసినప్పుడు అతను “గే” అని ఆరు నెలల పాటు అనుకున్నట్లు చెప్పింది. “నేను నా భర్తను గే అనుకోని ద్వేషించేదాన్ని. ఆరు నెలల పాటు అతను గే అని అనుకున్నాను, దూరం పెట్టాను” అని సరదాగా చెప్పింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. షిరీష్ కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటాడు అది నాకు ఇంకా చిరాకు కలిగిస్తుంది. 20 సంవత్సరాల వివాహంలో అతను ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదని జోక్ చేసింది. అయితే ఇప్పుడు అతనితో ఇప్పుడు జీవితం సౌకర్యవంతంగా ఉందని, మా బంధం 20 సంవత్సరాలుగా బలంగా ఉందని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.