SS Rajamouli: బాలీవుడ్‌కు నిద్ర పట్టకుండా చేస్తున్న రాజమౌళి..
పఠాన్ సినిమాతో బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్ చేసిన నార్త్ మేకర్స్‌కు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మరో షాక్ తగిలింది. తాజాగా ఆస్కార్ వేదిక మీద సత్తా చాటి మరోసారి బాలీవుడ్ డైలమాలో పడేశారు జక్కన్న
బాలీవుడ్ ఇండస్ట్రీకి నిద్రపట్టనివ్వకుండా చేస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. గ్రాఫిక్స్ వండర్స్, పాన్ ఇండియా ఫిలింస్, గ్లోబల్ ఇమేజ్ ఇలా ఎప్పటికప్పుడు నార్త్ సినిమాకు కొత్త చాలెంజెస్ విసురుతున్న జక్కన్న… ఇప్పుడు మరో టార్గెట్ సెట్ చేశారు. ఇండియన్ సినిమా కమర్షియల్ ట్రెండ్‌లో ఉన్న టైమ్‌లోనే మగధీర, ఈగ లాంటి విజువల్ వండర్స్‌ను రూపొందించి బాలీవుడ్ మేకర్స్ కూడా సౌత్ సినిమా వైపు చూసేలా చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సక్సెస్‌లతో నార్త్ మేకర్స్ ఎలర్ట్ అయినా… జక్కన్న బాలీవుడ్ రేంజ్‌ను కూడా దాటిపోతారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఆ కాన్ఫిడెన్స్ బ్రేక్ అవ్వడానికి పెద్ద టైమేం పట్టలేదు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌కు గేట్స్ ఓపెన్ చేసిన జక్కన్న… నార్త్ మార్కెట్‌ను కూడా కాంకర్ చేశారు. ఆ తరువాత రాజమౌళి బాటలో సౌత్‌లోనూ జెండా పాతాలని చాలా మంది బాలీవుడ్ మేకర్స్ ట్రై చేసినా… ఇంత వరకు సక్సెస్ అయిన దాఖలాలైతే లేవు. బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు సౌత్‌లో సక్సెస్ అయినా… భారీ ఫాలోయింగ్ అయితే రాలేదు. బాహుబలి 2 సినిమా వసూళ్ల పరంగానే కాదు రికార్డుల పరంగానూ బాలీవుడ్ ముందు చాలా చాలెంజెస్‌ను ఉంచింది. ఇండియన్ సినిమా అంతకు ముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని రేంజ్‌లో వెయ్యి కోట్ల మార్క్‌ను రీచ్ అవ్వటమే కాదు బాలీవుడ్‌లోనూ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచి నార్త్ మేకర్స్ ముందు బిగ్ టార్గెట్‌ను ఉంచింది. ఈ టైమ్‌లో పఠాన్ సినిమా నార్త్ ఇండస్ట్రీ మీద ఆశలు కల్పించింది.
రీసెంట్‌గా పఠాన్ సినిమాతో బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్ చేసిన నార్త్ మేకర్స్‌కు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మరో షాక్ తగిలింది. తాజాగా ఆస్కార్ వేదిక మీద సత్తా చాటి మరోసారి బాలీవుడ్ డైలమాలో పడేశారు జక్కన్న. వందేళ్ల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆస్కార్ సాధించిన తొలి సినిమాగా ట్రిపులార్ చరిత్ర సృష్టించింది. నాటు పాటకు ఆస్కార్ రావటంతో ఇప్పుడు ఈ టార్గెట్‌ను ఎచ్చీవ్ చేసేందుకు స్ట్రాటజీలు రెడీ చేసుకుంటున్నారు బాలీవుడ్ సినీ జనాలు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..