
అప్పటివరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్ గా చేసిన సినిమా బాహుబలి. తెలుగు సినిమా సత్తాను ఇండియా వైడ్‌గా చాటి చెప్పిన సినిమా బాహుబలి. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తెలుగు సినిమా కీర్తిని పెంచింది. అలిగి ప్రభాస్ కు, రానాకు ఫ్యాన్ బేస్ ను పెంచేసింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. వెయ్యికోట్లు వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రభాస్ హీరో, రానా దగ్గుబాటి విలన్ గా నటించిన బాహుబలి సినిమాలో తమన్నా, అనుష్క హీరోయిన్స్ గా నటించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా రెండు మంచి విజయాలను అందుకుంది.
‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా విడుదలై 2025 జులై 10.. ఇటీవలే ఈ సినిమా పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ క్రమంలోనే దర్శకదీరుడు రాజమౌళి ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ‘బాహుబలి: ది ఎపిక్’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను గ్రాండ్ లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. దాంతో పాటే బాహుబలి ఎపిక్ పనులు పూర్తిచేస్తున్నారు రాజమౌళి.
బాహుబలి ఎపిక్ టీజర్ విడుదలకు టైం ఫిక్స్ చేశారు. ఈ నెల 14న బాహుబలి ఎపిక్ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ ఆగస్టు 14న సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా థియేటర్స్ లో విడుదలవుతుంది. అలాగే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమాకూడా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. వీటితో పాటే బాహుబలి ఎపిక్ టీజర్ ను కూడా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. బాహుబలి రెండు పార్ట్‌లని కలిపి ఒక పార్ట్‌గా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హవా నడుస్తుండటంతో ఇలా రెండు పార్ట్స్ గా రిలీజ్ అయిన బాహుబలిని కలిపి సింగిల్ మూవీగా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాలో సీన్స్ ఏమైనా కట్ చేస్తారా.? లేక కొత్త సీన్స్ యాడ్ చేస్తారా అన్నది చూడాలి.
#BaahubaliTheEpic LOGO!! #Celebrating10YearsOfBaahubali #Baahubali #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/MrB4kBvXqr
— Baahubali (@BaahubaliMovie) August 11, 2025
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి