
S. S. Rajamouli: టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఇటీవల సినీ పెద్దలు కలిసిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ సమస్యల పై సానుకూలంగా స్పందించారు సీఎం. ఏపీలో టికెట్ రేట్లను పెంచుతూ జీవోను విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలో రాజమౌళి ఇప్పుడు జగన్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి, ఈ సినిమా నిర్మాత దానయ్యతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాజమౌళి, దానయ్య అనంతరం అక్కడి నుంచి తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
ఈ నెల 25 ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అంశంపై సీఎం జగన్ తో రాజమౌళి చర్చించారని తెలుస్తుంది. ఏపీలో ప్రత్యేక షోలు వేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరారు రాజమౌళి. అలాగే సినిమా టిక్కెట్లు ధరల అంశంపై రాజమౌళి చర్చించారు. రాజమౌళి పాటు సమావేశంలో మంత్రులు పేర్ని నాని ,కొడాలి నాని కూడా పాల్గొన్నారు. ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో అలియా భట్.. అజయ్ దేవ్ గణ్.. శ్రియ సరన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సాంగ్స్ మూవీపై అంచనాలను మరింత పెంచాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :