
సినిమా ఇండస్ట్రీలో మరో సారి డ్రగ్స్ జాడలు బయట పట్టాయి. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తోన్న ఒక ఫేమస్ నటుడు
డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం చెన్నైలోనే స్థిరపడిన ఆ హీరోను చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. అనంతరం అతని బ్లడ్ శాంపిల్స్ సేకరించి రిపోర్టుల కోసం ల్యాబ్‌కు పంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏఐడీఎంకే మాజీ నేత నుంచి నటుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ పెడ్లర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హీరోను విచారిస్తున్నారు. విచారణలో భాగంగా మరికొందరు తమిళ నటుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇటీవల చెన్నైలోని నుంగంబాక్కంలో జరిగిన బార్ ఘర్షణ కేసుకు సంబంధించి AIADMK మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ అజయ్ వందయార్‌తో పాటు మరో 9 మందిని నుంగంబాక్కం పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే క్రమంలో AIADMK మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్‌ను సెల్ ఫోన్ కాంటాక్ట్‌లను పరిశీలించినప్పుడు పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతన్ మాదకద్రవ్యాల స్మగ్లర్‌తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇదే కేసుకు సంబంధించి సేలం లో ప్రదీప్ కుమార్ ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 11 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రదీప్ కుమార్ 2023 నుంచి ప్రసాద్ కు కొకైన్ అమ్ముతున్నట్లు కూడా వెల్లడైంది. ఈ క్రమంలోనే హీరో కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? ఒకరికి ఒకరు సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించిన హీరో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్.
తిరుపతికి చెందిన శ్రీకాంత్ ‘రోజా పూలు’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే కనిపించాడు. మధ్యలో తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ తో ఆకట్టుకున్నాడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, దడ, నిప్పు, సుప్రీమ్, రాగల 24 గంటల్లో, లై, శ్రీనివాస కల్యాణం, టెన్త్ క్లాస్ డైరీస్ తదితర సినిమాల్లో నటించాడు.
హీరో శ్రీరామ్ చివరిగా హరికథ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.