AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో మహేష్ బాబు పక్కన ఉన్న బుడతడు ఇప్పుడు ఓ క్రేజీ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..

హీరోల చిన్న నాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో సినిమా తారల ఫోటోలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

ఈ ఫొటోలో మహేష్ బాబు పక్కన ఉన్న బుడతడు ఇప్పుడు ఓ క్రేజీ  హీరో.. ఎవరో గుర్తుపట్టారా..
Mahesh
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2021 | 8:41 AM

Share

హీరోల చిన్న నాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో సినిమా తారల ఫోటోలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలా ఇప్పుడు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక ఫొటోలో మహేష్ బాబు ఉనండంటే ఆయన చుట్టూ ఉన్నవారిని ఎవ్వరు పెద్దగా గమనించారు. కేవలం మహేష్‌ను మాత్రమే చూస్తూ ఉండిపోతారు.. కానీ ఈ ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన కనిపిస్తున్న బుడతడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈ చిన్నోడు.. కుర్రాడుగా మారిపోయాడు.. అంతే కాదు హీరో కూడా అయ్యాడు. త్వరలోనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతే ఈ బాబు ఓ స్టార్ హీరో కొడుకు కూడా.. ఇంతకు అతను ఎవరో గుర్తుపట్టారా..

సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన కనిపిస్తున్న ఈ చిన్న బాబు ఎవరో కాదు.. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. ఈ యంగ్ బాయ్ ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. రోషన్ ముందు నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న రోషన్… ఇప్పుడు పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ తో రాబోతున్నాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కుతుంది.  ఈ సినిమాకు గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తుండగా… కృష్ణమోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గత పెళ్లి సందడి చిత్రానికి సీక్వెల్ కాదని ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. నేడు(22) ఉదయం 11 గంటలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేయించనున్నారు.

Mahesh Babu

Mahesh Babu

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case : చివరికి చేరుకున్న ఈడీ విచారణ.. నేడు అధికారుల ముందుకు హీరో తరుణ్

PV Sindhu-Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మ్యాచ్ ఆడిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా..! వైరలవుతోన్న వీడియో‎

Mahesh Babu MAharshi: ‘మహర్షి’ ఖాతాలో మరో అవార్డు.. మహేష్ బాబు మాటల్లో ఆనందం అసలు మేటరేంటంటే..(వీడియో)

Follow Us