తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమా ఖడ్గం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ, బ్రహ్మజీ, పూజా భారతి కీలకపాత్రలు పోషించారు. 2002లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. లవ్, కామెడీ, దేశం ఎమోషన్, మూవీ ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కలిపి మల్టీ జానర్లో ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సందర్భంగా టీవీల్లో ప్రసారం చేస్తుంటారు. అలాగే ఈమూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు.
ఖడ్గం సినిమాను అక్టోబర్ 18న రీరిలీజ్ చేస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో పెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కృష్ణవంశీ, శ్రీకాంత్, శివాజీ రాజా, షపీ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ.. “భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాను” అని అన్నారు.
అలాగే హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ సినిమాల్లో అన్నిటిలో ఖడ్గం గొప్ప సినిమా. అసలు ఖడ్గం సినిమాలో నిర్మాత మధు మురళి నన్ను వద్దు అన్నారు. కానీ కృష్ణవంశీ ధైర్యం చేసి ఆయన్ను ఒప్పించి నన్ను ఈ సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమాను మర్చిపోలేను. ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ” అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.