Kalyaan Dhev: మెగాస్టార్ చిన్నల్లుడి భావోద్వేగ పోస్ట్.. దాని వెనుక నిగూడార్థం అదేనా

కళ్యాణ్ దేవ్ ఇప్పటివరకు 3 సినిమాలు చేశాడు. నటుడిగా మంచి పేరు వచ్చినప్పటికీ.. సినిమాలు మాత్రం హిట్ అవ్వలేదు. రెవిన్యూ జనరేట్ అవ్వలేదు.

Kalyaan Dhev: మెగాస్టార్ చిన్నల్లుడి భావోద్వేగ పోస్ట్.. దాని వెనుక నిగూడార్థం అదేనా
Actor Kalyaan Dhev

Updated on: Dec 21, 2022 | 8:47 PM

కళ్యాణ్ దేవ్. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు. శ్రీజ భర్త. ఎప్పుడైతే ఈయన మెగా అల్లుడు కాబోతున్నాడని వార్తలు వచ్చాయో.. అప్పుడే ఎవర్రా ఈయన.. హీరో మెటిరీయల్‌లా ఉన్నాడు అని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే మ్యారేజ్ అయిన కొన్నాళ్లకు విజేత సినిమాతో హీరో లక్ టెస్ట్ చేసుకున్నారు. నటుడిగా మంచి పేరు వచ్చింది కానీ సినిమా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. కానీ ఆ తర్వాత ఈయన సినిమాలు ఒప్పుకున్న దాఖలాలు లేవు. శ్రీధర్ సీపాన డైరెక్షన్‌లో ఓ సినిమా అనౌన్స్ చేశారు గానీ దాని గురించి అప్‌డేట్స్ లేవు.

కాగా కళ్యాణ్ దేవ్, శ్రీజ దంపతులకు నవిష్క అనే పేరుగల కుమార్తె ఉంది. అయితే ఈ కపుల్ మధ్య విబేధాలు వచ్చినట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇద్దరూ వేరుగా ఉంటున్నారని కూడా చెబుతున్నారు. కానీ ఈ వార్తలపై రెండు కుటుంబాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. 2021లో కళ్యాణ్ దేవ్ బర్త్ డే సందర్భంగా ‘నా జీవితాంతం నా ప్రాణ స్నేహితుడితో జీవించే అదృష్టం దొరికింది చాలు’ అంటూ శ్రీజ షేర్ చేసిన ఓ పోస్ట్ కూడా ఇప్పుడు ఆమె ఇన్ స్టాలో కనిపించడం లేదు. అంతేకాదు మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో సైతం కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదు. తాజాగా ఉపాసన ఇచ్చిన క్రిస్మస్ పార్టీలోనూ అతడి జాడ లేదు.

కాగా మొన్నీమధ్య కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ కొటేషన్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ‘ఓపికగా ఉండండి.. అన్ని ప్రార్థనలకు సమాధానం దొరుకుతుంది’ అంటూ ఆయన అందులో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన వారంతా కళ్యాణ్ ఎందుకు అంత డెప్త్ ఉన్న పోస్ట్ పెట్టాడా అని ఆరాలు తీస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి