- Telugu News Photo Gallery Cinema photos Do you know these controversies from south cinema in 2022 kantara plagiarism to nayanthara surrogacy telugu cinema news
Year Ender 2022: ఈ ఏడాది దక్షిణాదిలో నెలకొన్న వివాదాలు ఇవే.. నయనతార కవల పిల్లల నుంచి కాంతార సినిమా వరకు..
ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు పాన్ ఇండియా చిత్రాలు సత్తా చాటిన.. మరోవైపు కొన్ని వివాదాలు నెలకొన్నాయి. అవెంటో తెలుసుకుందామా.
Updated on: Dec 21, 2022 | 8:38 PM

ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు పాన్ ఇండియా చిత్రాలు సత్తా చాటిన.. మరోవైపు కొన్ని వివాదాలు నెలకొన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

కిచ్చా సుదీప్, అజయ్ దేవగన్ ట్విట్టర్ వార్.. కిచ్చా సుదీప్ ఓ కార్యక్రమంలో 'హిందీ జాతీయ భాష కాదు' అని చెప్పడంతో వివాదం మొదలైంది. దీంతో తన చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నావు అని సుదీప్‌ను అడిగారు అజయ్. ఇక ఆ తర్వాత వారిద్దరి మధ్య కాస్త ఎక్కువగానే ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది.

సాయి పల్లవి.. గో సంరక్షణ వివాదం.. తాను నటించిన విరాటపర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవి మాట్లాడిన మాటలతో వివాదం నెలకొంది. కాశ్మీర్ మరణా హోమాన్ని.. ఆవు స్మగ్లింగ్ కోసం చేసిన హత్యలతో పోల్చింది. దీంతో సాయి పల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంతార.. రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రంలో దళితుల పాత్రను.. మహిళల ప్రాతినిధ్యాన్ని తగ్గించారని.. స్త్రీ ద్వేషపూరిత సన్నివేశాలను పొందుపరిచారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే వరాహ రూపం సాంగ్ కాపీ వివాదం

నయనతార.. కవల పిల్లలు.. ఈ ఏడాది జూన్ 9న నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత నాలుగు నెలలకే అక్టోబర్ 9న కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించడంతో సరోగసి వివాదం నెలకొంది.

కన్నడలో రష్మిక నిషేదం.. కాంతార సినిమా విషయంలో రష్మిక చెప్పిన సమాధానం చాలా మందికి నచ్చలేదు. ఆ తర్వాత తనను కథానాయికగా పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పడానికి ఆమె ఇష్టకపడకపోవడం.. సో కాల్డ్ ప్రొడక్షన్ అని పిలవడంతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను కన్నడ పరిశ్రమ బ్యాన్ చేస్తుందని వార్తలు వినిపించాయి.





























