AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sree Vishnu: అర్జునుడి ఆగమనానికి డేట్‌ ఫిక్స్‌.. శ్రీ విష్ణు కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నాడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీ విష్ణు. ఇటీవల 'రాజ రాజా చోర' చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు

Sree Vishnu: అర్జునుడి ఆగమనానికి డేట్‌ ఫిక్స్‌.. శ్రీ విష్ణు కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..
Basha Shek
|

Updated on: Dec 16, 2021 | 8:30 PM

Share

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నాడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీ విష్ణు. ఇటీవల ‘రాజ రాజా చోర’ చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోరును ఇలాగే కొనసాగిస్తూ త్వరలో ‘ అర్జున ఫల్గుణ’ సినిమాతో మళ్లీ మన ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. కాగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్‌ 31న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

కాగా ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ శ్రీవిష్ణుతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనుంది. ఆమె ‘రెడ్‌’, ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుంది. ఆమెతో పాటు నరేశ్‌, సుబ్బరాజు, మహేశ్‌, శివాజీ రాజా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో తేజ మార్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నిరంజన్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా ప్రియదర్శన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. ‘అర్జున ఫల్గుణ’తో పాటు ‘భళా తందనాన’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు శ్రీ విష్ణు. Also Read:

Water Supply Scheme: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. ఉచిత నీటి పథకానికి నమోదు చేసుకోని వారికి బిల్లులు..

Telangana: రేపు కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ సంయుక్త సమావేశం.. చర్చకు రానున్న అంశాలివేనా?

East Godavari: ఇంజినీరింగ్‌ విద్యార్థిని కిడ్నాప్ కలకలం.. రూ. 5లక్షలు డిమాండ్‌ చేస్తున్న దుండగులు..