Urvashi Rautela: డైమండ్స్‌తో రూపొందించిన డ్రెస్‌తో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.. ధర ఎంతంటే..

తన అందం, అభినయంతో హిందీ ప్రేక్షకుల అభిమానం చూరగొంటోంది ఊర్వశి రౌతేలా. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ హరిద్వార్‌ ముద్దుగుమ్మ 2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో సిల్వర్‌ స్ర్కీన్పై అడుగుపెట్టింది.

Urvashi Rautela: డైమండ్స్‌తో రూపొందించిన డ్రెస్‌తో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.. ధర ఎంతంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 16, 2021 | 7:24 PM

తన అందం, అభినయంతో హిందీ ప్రేక్షకుల అభిమానం చూరగొంటోంది ఊర్వశి రౌతేలా. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ హరిద్వార్‌ ముద్దుగుమ్మ 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో సిల్వర్‌ స్ర్కీన్పై అడుగుపెట్టింది. ‘సనమ్‌ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ-4’, ‘పాగల్‌ పంతీ’, ‘వర్జిన్‌ భానుప్రియ’సినిమాల్లో నటించి మెప్పించింది. త్వరలో ‘బ్లాక్‌రోజ్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుందీ అందాల తార. కాగా భారత్ తరఫున 2015లో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. కాగా ఇటీవల ఇజ్రాయెల్‌ వేదికగా జరిగిన ‘మిస్​యూనివర్స్ -2021’ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది ఊర్వశీ. తద్వారా భారత్‌ ​తరఫున ఈ గ్రాండ్‌ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా వెళ్లిన అతిపిన్నవయస్కురాలిగా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. కాగా 2015లో ఇదే మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరఫున తన అదృష్టం పరీక్షించుకున్న ఈ అమ్మడు.. తాజాగా అవే ప్రతిష్ఠాత్మక అందాల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం విశేషం. ఈ పోటీల్లో మన దేశానికే చెందిన హర్నాజ్ సంధు విశ్వ సుందరి కిరీటం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ అందాల పోటీల అనంతరం ముంబయికి విచ్చేసింది ఊర్వశి. ముంబై విమానాశ్రయంలో బేబీ పింక్ కలర్ డ్రెస్ ధరించి కనిపించింది . ఈ సందర్భంగా కెమెరా కళ్లు ఆమెను క్లిక్‌మనిపించాయి. కాగా ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా తను ధరించిన డ్రెస్ ధర, విశేషాలు తెలుసుకొని చాలామంది అవాక్కయ్యారు. ఊర్వశి ధరించిన డ్రెస్ ధర సుమారుగా రూ.5లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ డ్రెస్‌లో డైమండ్‌లను కూడా పొందుపరచడం విశేషం. ఆమె ధరించిన చెవి రింగులు కూడా వజ్రాలతోన తయారైనవే. కాగా ఇలా వెరైటీ డ్రెస్‌లు, అవుట్‌ఫిట్‌లతో వార్తల్లో నిలవడం ఊర్వశికి మొదటిసారి కాదు. బాలీవుడ్‌లో ఫ్యాషన్‌ దివాగా ఆమెకు పేరుంది.

Also Read:

Spiderman: హౌస్‌ఫుల్‌ బోర్డులతో కళకళలాడుతున్న ‘స్పైడర్‌ మ్యాన్‌’ థియేటర్లు.. పాన్‌ ఇండియా సినిమాలకు సరికొత్త జోష్‌..

Pushpa The Rise : బన్నీ పడ్డ కష్టం థియేటర్స్‌లో విజిల్స్ కొట్టించడం ఖాయం అంటున్న అభిమానులు..

Chiyaan Vikram : హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్.. సెలబ్రెటీలనూ వదలని మహమ్మారి

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం