Spiderman: హౌస్‌ఫుల్‌ బోర్డులతో కళకళలాడుతున్న ‘స్పైడర్‌ మ్యాన్‌’ థియేటర్లు.. పాన్‌ ఇండియా సినిమాలకు సరికొత్త జోష్‌..

కరోనా రెండో దశ ఉద్ధృతి అనంతరం ఇండియాలో అత్యధిక కలెక్షన్లను రాబట్టి ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించిన చిత్రం 'సూర్యవంశీ'. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన

Spiderman: హౌస్‌ఫుల్‌ బోర్డులతో కళకళలాడుతున్న 'స్పైడర్‌ మ్యాన్‌' థియేటర్లు.. పాన్‌ ఇండియా సినిమాలకు సరికొత్త జోష్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 16, 2021 | 5:57 PM

కరోనా రెండో దశ ఉద్ధృతి అనంతరం ఇండియాలో అత్యధిక కలెక్షన్లను రాబట్టి ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించిన చిత్రం ‘సూర్యవంశీ’. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ మహమ్మరి దెబ్బకు సందిగ్ధంలో పడిపోయిన సినిమా ఇండస్ట్రీకి సరికొత్త జోష్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యం, ఉత్సాహంతోనే మరికొన్ని సినిమాలు థియేటర్లలోకి అడుగుపెట్టాయి. ఘన విజయం సాధించాయి. అయితే ఈ ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఓ హాలీవుడ్ సినిమా రెట్టింపు చేసింది.. అదే స్పైడర్ మ్యాన్ నో వే హోం. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్‌ హీరో సినిమా ఫస్ట్‌ షో విషయంలో ఆఫ్టర్ కోవిడ్ రికార్డ్‌ సెట్‌ చేసింది. సెకండ్‌ వేవ్ తరువాత సినిమా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అన్న అనుమానాలను ‘సూర్యవంశీ’ చెరిపేస్తే.. రికార్డ్ వసూళ్లు కూడా సాధ్యమే అన్న కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది ‘స్పైడర్‌ మ్యాన్‌’. గతంలో ఇండియాలో ఏ హాలీవుడ్ సినిమాకు రాని ఓపెనింగ్స్‌ ఈ స్పైడర్‌ మ్యాన్‌కు రావడం విశేషం.

పాన్‌ ఇండియా సినిమాలకు దారి.. ‘సూర్యవంశీ’ సినిమా విడుదల సమయానికి నార్త్ లో ఇంకా కొవిడ్‌ భయాలు పూర్తిగా తొలగిపోలేదు. అందుకే ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు 30 – 32 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వచ్చింది. కానీ ‘స్పైడర్‌ మ్యాన్‌’ టైమ్‌కు జనాలు థియేటర్లకు వచ్చేందుకు బాగా అలవాటు పడ్డారు. దీనికితోడు ఫ్యామిలీ ఆడియన్స్‌, పిల్లలోనూ మంచి క్రేజ్ ఉన్న సూపర్ హీరో సినిమా కావడంతో స్పైడర్‌ మ్యాన్‌ రిలీజ్ అవుతున్న థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డ్‌లతో కళకళలాడాయి. ఏకంగా 60 శాతానికిపైగా ఆక్యుపెన్సీతో ఆఫ్టర్ కోవిడ్ ఆల్‌టైమ్ రికార్డ్ సెట్‌ చేశాడీ సూపర్ హీరో. స్పైడర్‌ మ్యాన్ సెట్ చేసిన ఈ నయా రికార్డ్… రిలీజ్‌కు రెడీ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో కొత్త జోష్ తీసుకువచ్చింది.’పుష్ప’ ఆర్ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ లాంటి సినిమాలకు ఆక్యుపెన్సీ ఏ రేంజ్‌లో ఉంటుందో అన్న అనుమానాలకు కూడా తెరపడింది. హాలీవుడ్ సినిమాలకే ఈ రేంజ్‌లో రెస్పాన్స్‌ ఉందంటే… సాలిడ్ ఇండియన్‌ సినిమా వస్తే థియేటర్లలో మాస్‌ జాతర వచ్చినట్లేనని సినిమా పండితులు అభిప్రాయపడుతున్నారు.

సతీష్, టీవీ9

Also Read:

Pushpa The Rise : బన్నీ పడ్డ కష్టం థియేటర్స్‌లో విజిల్స్ కొట్టించడం ఖాయం అంటున్న అభిమానులు..

Chiyaan Vikram : సెలబ్రెటీలనూ వదలని మహమ్మారి.. హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్..

Radhe Shyam: ఖుషీలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. రాధేశ్యామ్‌ నుంచి ‘సంచారి’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది..