Alluri Pre Release Event : విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నటున్నారు హీరో శ్రీ విష్ణు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా.. తనదైన శైలిలో డిఫరెంట్ క్యారెక్టర్లు రాణిస్తూ టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు శ్రీవిష్ణు (Sree Vishnu). తాజాగా అల్లూరి (Alluri) మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు..డైరెక్టర్ ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఓ పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌గా ‘అల్లూరి’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవంటి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు శ్రీవిష్ణు. ఇటీవలే నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదలైన అల్లూరి ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అల్లూరి ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఈ క్రింద లైవ్ లో చూడండి..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.