నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసింది. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వేదికగా ఈ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకలో జరిగిన ఓ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ వేడుకలో ‘డాకు..’ సాంగ్ ప్లే చేశారు. అప్పుడు తమన్ సంగీతంలోని బేస్ దెబ్బకు స్పీకర్లు కిందపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన టీమ్ వాటిని మళ్లీ తీసి ఏరేంజ్ చేయాల్సి వచ్చింది. ఇక తమన్ మ్యూజిక్ దెబ్బకు స్పీకర్లు కిందపడడంతో తమన్ తోపాటు అక్కడున్న డాకు మహారాజ్ మూవీ టీం పడి పడి నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా..బాలయ్య, తమన్ కాంబో అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఆ తర్వాత తమన్ మాట్లాడుతూ.. బాలయ్యగారితో సినిమా అంటే స్పీకర్లు కాలతాయి.. బాలకృష్ణ, నాది సినిమా వస్తుందంటే కొత్త స్పీకర్లు రెడీగా పెట్టుకోండి.. అందుకు నేనెమి చేయలేను. నాది వార్నింగ్ కాదు.. సినిమాలో హై ఉండడం వల్ల అటువంటి మ్యూజిక్ ఇస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.
The speakers blasted and fell down 💥 !! @MusicThaman @dirbobby #DaakuMaharaaj #thamanthings pic.twitter.com/StkxZ2jNgb
— Vijay Kartik Kannan (@KVijayKartik) January 10, 2025
Theaters lo situation meeke vadilestunnam 😉🔊🔊🎚️🎛️🔥 🔥 @MusicThaman #DaakuMaharaaj https://t.co/Gm8OzgG4C8
— Bobby (@dirbobby) January 10, 2025
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..