Soundarya: మోహ‌న్ బాబుతో సౌందర్యకు ఆస్తి గొడ‌వ‌లు ఉన్నాయా..? క్లారిటీ ఇచ్చిన నటి భర్త

'సౌందర్య మరణం ప్రమాదవశాత్తూ జరిగింది కాదు' అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ అంశంలో సీనియర్ నటుడు మోహన్​ బాబుపై వస్తోన్న వర్తలను సౌందర్య భర్త రఘు ఖండించారు. నటుడు మోహన్‌ బాబుతో తమకు లాంటి ఆస్తి గొడవలు లేవని దివంగత నటి సౌందర్య భర్త స్పష్టం చేశారు.

Soundarya: మోహ‌న్ బాబుతో సౌందర్యకు ఆస్తి గొడ‌వ‌లు ఉన్నాయా..? క్లారిటీ ఇచ్చిన నటి భర్త
Soundarya Issue

Updated on: Mar 13, 2025 | 2:08 PM

ఖమ్మం జిల్లా సత్యనారాయణపురానికి చెందిన చిట్టిమల్లు అనే వ్యక్తి నటుడు మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ శివారు జల్‌పల్లి గెస్ట్ హౌస్‌ ఒకప్పటి హీరోయిన్ సౌందర్యదని.. దాన్ని నిర్మాత మోహన్‌బాబు బలవంతంగా లాక్కున్నారన్నది చిట్టిమల్లు వాదన. ఆ గెస్ట్‌హౌస్‌ను తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని అనాధ ఆశ్రమానికి లేదంటే మిలటరీకి అప్పగించాలని డిమాండ్ చేశాడు. అలాగే మోహన్‌బాబుపై చర్యలు తీసుకోవాలంటూ ఖమ్మం రూరల్‌ పోలీస్ స్టేషన్‌తో పాటు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు.

చిట్టిమల్లు ఆరోపణలపై సౌందర్య భర్త రఘు స్పందించారు. సౌందర్య ఆస్తిని మోహన్‌బాబు లాక్కున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని లెటర్ రిలీజ్ చేశారు. మోహన్‌ బాబుతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదని స్పష్టం చేశారు. పాతికేళ్లుగా రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని.. తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవన్నారు.  తాను మోహన్‌ బాబును ఎంతో గౌరవిస్తానని, తామంతా ఒకే కుటుంబంగా ఉంటామని చెప్పారు.  తప్పుడు ప్రచారాలు వెంటనే ఆపాలని లేఖలో కోరారు రఘు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.