సోనూసూద్ కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. తెలుగు, కన్నడ, తమిళం ఇలా అవకాశం వచ్చిన అన్ని భాషల్లోనూ నటిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి ఇక్కడి ఆడియెన్స్ కు చేరువయ్యాడు. ఇక కోవిడ్ సమయంలో సోనూ సూద్ చేసిన మంచి పనులు అతనిని రియల్ హీరోగా నిలబెట్టాయి. పలు భాషల్లో నటించిన సోనూసూద్‌కు చిత్ర పరిశ్రమల ఆచార వ్యవహారాలు, అక్కడి నటీనటులు బాగా తెలుసు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ బాలీవుడ్ నటుల గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. ‘కొందరు బాలీవుడ్ నటులు ఉదయం షెడ్యూల్ చేసిన సినిమా షూటింగ్ కోసం మధ్యాహ్నం 3 గంటలకు వస్తారు. అప్పటి వరకు ఇతర నటీనటులు, టెక్నీషియన్లు వేచి చూస్తుంటారు. ఈ కారణంగా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. అంతే కాదు నిర్మాతలు విదేశాల్లో షూటింగ్ చేస్తే 100 మంది కాకుండా 150-200 మందిని కూడా తీసుకుంటారు. దీంతో అనవసర ఖర్చులతో సినిమా బడ్జెట్‌కు మించిపోతుంది.’
‘ఫతేహి’ సినిమా షూటింగ్ కోసం నేను లండన్ వెళ్లాను. నేను ఒంటరిగా అక్కడికి వెళ్లి కేవలం 12 మందితో కూడిన స్థానిక బృందాన్ని నియమించాను. అందుకు అవసరమైన అనుమతులను పొందాను. శాన్‌ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్‌పై షూటింగ్‌కు అనుమతి కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. వాళ్లు కూడా 12మందికే అనుమతి ఇచ్చారు. మీకు సినిమాలో కనిపించే ఆ సీక్వెన్స్ మొత్తం కొద్దిమంది బృందంతోనే తీశాను. ఇక దుబాయ్‌లో అయితే, నాతో పాటు కేవలం ఆరుగురిని మాత్రమే తీసుకెళ్లాను. చిత్రీకరణకు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నా, అది తెరపై కనిపించడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు సోనూ సూద్.
సోనూసూద్ తొలిసారి మెగాఫోన్ పట్టి రూపొందిస్తున్న చిత్రం ఫతేహ్. నిర్మాణ బాధ్యతలను కూడా అతనే చూసుకున్నారు. విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా, దివ్యేందు భట్టాచార్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. సైబర్ మాఫియా కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.
#Fateh is a full-throttle action ride! Sonu Sood’s directorial debut is impressive, with incredible action sequences. Balancing multiple roles, Sonu aces direction, acting, and writing. A solid performance from the entire cast. A must-watch for action lovers! #SonuSood… pic.twitter.com/5H3RRNC33r
— Ramesh Bala (@rameshlaus) January 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.