Fish Venkat- Sonu Sood: ఇకపై ఆ బాధ్యతంతా నాదే.. ఫిష్ వెంకట్ కుటుంబానికి మాటిచ్చిన సోనూసూద్.. వీడియో ఇదిగో

ఇటీవలే కన్నుమూసిన టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని సోనూసూద్ పరామర్శించారు. మంగళవారం (ఆగస్టు 05) వెంకట్ ఇంటికి వెళ్లి నటుడి భార్య, కూతురు ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇదే సందర్భంగా ఫిష్ వెంకట్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని మాటిచ్చారు.

Fish Venkat- Sonu Sood: ఇకపై ఆ బాధ్యతంతా నాదే.. ఫిష్ వెంకట్ కుటుంబానికి మాటిచ్చిన సోనూసూద్.. వీడియో ఇదిగో
Sonusood

Updated on: Aug 05, 2025 | 7:45 PM

వందలాది సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడి చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన జులై 18న తుది శ్వాస విడిచారు. ఫిష్ వెంకట్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖులు కూడా వెంకట్ అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు చెప్పారు. తాజాగా ప్రముఖ నటుడు సోనూసూద్ ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించారు. మంగళవారం (ఆగస్టు 05) హైదరాబాద్ వచ్చిన రియల్ హీరో వెంకట్ ఇంటికి వెళ్లారు. అక్కడ నటుడి భార్య, కూతురుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడొద్దంటూ వారికి భరోసా ఇచ్చారు. అన్ని విధాల కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చారు. ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. సోనూసూద్ నిజమైన రియల్ హీరో అని ప్రశంసలు కురిపించింది.

‘సోనూసూద్ సార్ చేస్తున్న సాయానికి మేం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఆయన నాన్నతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. మా కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చారు. నాన్న అంత్యక్రియలు, దశ దినకర్మకు సోనూసూద్ సార్ రూ.1.50 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మా ఇల్లు చూసి, అది పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన చేస్తున్న సాయానికి మేం జీవితాంతం రుణపడి ఉంటాం’ అని షిఫ్ వెంకట్ కూతురు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఫిష్ వెంకట్ ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతోన్న సోనూసూద్.. వీడియో

ప్రస్తుతం స్రవంతి కూతురు నెట్టింట వైరలవుతున్నాయి. సోనూసూద్ పై మరోసారి ప్రశంసల వర్షం కురుస్తోంది. అతను రియల్ హీరో అని మరోసారి ప్రూవ్ అయ్యిందంటూ నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..