
ఇటీవల కాలంలో ఓటీటీలో బోల్డ్, రొమాంటిక్, మిస్టరీ, సస్పెన్స్ చిత్రాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న పలు చిత్రాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన భారీ బడ్జెట్ చిత్రాలు కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి.. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఓటీటీలో మాత్రం నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఐఏండీబీలో 7.2 రేటింగ్ ఉండడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? అదే ఫతే మూవీ. టాలీవుడ్ నటుడు సోనూ సూద్ హీరోగా నటించిన చిత్రం. ఈ సినిమాకు ఆయనే కథ అందించి దర్శకత్వం వహించారు.
ఈ ఏడాది జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఫతే సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశ పరిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం జియో సినిమాలో అత్యధికంగా వ్యూస్ సాధించిన సినిమాగా నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుంది. యాక్షన్, రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతుంది.
కథ విషయానికి వస్తే.. పంజాబ్ లో సాధరణ జీవితం గడిపే ఓ వ్యక్తి కథ. ఈ చిత్రంలో ఫతే సింగ్ పాత్రలో సోనూ సూద్ కనిపించగా.. అతడి సోదరి ఒక భయంకరమైన సైబర్ క్రైమ్ ముఠా చేతిలో మోసపోతుంది. దీంతో ఆమె జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. తన సోదరికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న సోనూసూద్.. ఈ విషయం గురించి లోతుగా ఆరా తీయగా.. ఎంతో మంది అమ్మాయిలు ఇలాంటి సైబర్ నేరాల వలలో చిక్కుకుని బలైపోతున్నారని నిజం తెలుసుకుంటాడు. ఆ తర్వాత అమ్మాయిలకు అండగా నిలబడి సైబర్ క్రైమ్ ముఠాతో పోరాడుతాడు. ఇందులో సోనూసూద్ హీరోగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో సినిమాలో దుమ్మురేపుతుంది.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..