AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sritej Health Update: ఆస్పత్రి నుంచి శ్రీతేజ్‌ డిశ్చార్జ్‌.. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను సికింద్రాబాద్‌ కిమ్స్‌ కడిల్స్ ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. శ్రీతేజ్‌కు ఇకపై వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సహాయం అవసరం లేదని హెల్త్‌ బులిటెన్‌‌లో వైద్యులు వివరించారు. బాలుడు నోటి ద్వారా ఆహారం తీసుకొంటున్నట్లు చెప్పారు.

Sritej Health Update: ఆస్పత్రి నుంచి శ్రీతేజ్‌ డిశ్చార్జ్‌.. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?
Sritej
Ram Naramaneni
|

Updated on: Apr 30, 2025 | 6:47 AM

Share

పుష్ప 2 ప్రిమియర్ సందర్భంగా..  హైదరాబాద్ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండటంతో డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించి..  అక్కడ 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరఫీ వంటివి చేశాక ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించారు. దీంతో బాలుడ్ని న్యూరో-రిహాబ్ సేవల కోసం రాంగోపాల్‌పేటలోని ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు.

2024, డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె తనయుడు శ్రీతేజ్‌ గాయాలపాలై.. అప్పటినుంచి  చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్‌కు మొత్తంగా 4 నెలల 25 రోజుల పాటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కొనసాగింది.

ఇన్ఫెక్షన్లు లేకుండా బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..  శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ తెలిపారు. కళ్లు తెరిచి చూస్తున్నాడని.. ద్రవరూపం ఫుడ్ అందిస్తున్నట్లు వివరించారు. తమను ఇంకా గుర్తుపట్టే పరిస్థితిల్లో లేడని.. డాక్టర్ల సూచన మేరకు రిహాబిలిటేషన్‌కు తరలిస్తామన్నారు. బాబు చికిత్స కోసం తమ వద్ద నుంచి కిమ్స్ ఆస్పత్రి ఎలాంటి డబ్బు తీసుకోలేదని తెలిపారు. కష్టకాలంలో తమకు తోడు నిలిచిన అందరికీ శ్రీతేజ్ తండ్రి భాస్కర్  కృతజ్ఞతలు తెలిపారు.

కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌ను డిసెంబర్ 13న అరెస్టు చేశారు. అయితే, హైకోర్టు తరువాత అతనికి బెయిల్ మంజూరు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్