Kaikala Satyanarayana: వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసిన మహా నటుడు కైకాల సత్యనారాయణ

|

Dec 23, 2022 | 8:54 AM

త‌న సినీ కెరీర్‌లో కైకాల స‌త్య‌నారాయ‌ణ ఏడు వంద‌ల‌కు పైగా సినిమాల్లో న‌టించాడు. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ర‌క‌ర‌కాల పాత్ర‌ల్లో మెప్పించాడు.

Kaikala Satyanarayana: వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసిన మహా నటుడు కైకాల సత్యనారాయణ
Rip Kaikala Satyanarayana
Follow us on

ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసిన మహా నటుడు కైకాల సత్యనారాయణ. ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించిన కైకాల కన్నుమూశారు. త‌న సినీ కెరీర్‌లో కైకాల స‌త్య‌నారాయ‌ణ ఏడు వంద‌ల‌కు పైగా సినిమాల్లో న‌టించాడు. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ర‌క‌ర‌కాల పాత్ర‌ల్లో మెప్పించాడు. వ‌యోభారంతో ఇప్పుడు ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా కైకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెల్లవారుజామున కన్నుమూశారు.

కరుడుగట్టిన విలన్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన సత్యనారయణ.. ఆ ఇమేజ్‌ను బ్రేక్‌ చేయటంలోనూ సక్సెస్‌ అయ్యారు. విలన్‌గా నటిస్తూనే నెమ్మదిగా పాజిటివ్ రోల్స్‌లోనూ ఆడియన్స్‌ను మెప్పిస్తూ వచ్చారు. చిరు, బాలయ్య జనరేషన్‌కు వచ్చేసరికి పాజిటివ్‌ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. విలన్‌గా చేస్తూనే మరోవైపు సాఫ్ట్ సెన్సిబుల్‌ పాత్రలకు కూడా స‌త్యనారాయ‌ణ బెస్ట్ ఆప్షన్ అయ్యారు.

సంసారం సాగ‌రం, రామ‌య్య తండ్రి, జీవిత‌మే ఒక నాట‌క‌రంగం, దేవుడే దిగివ‌స్తే, తాయార‌మ్మ- బంగార‌య్య, పార్వతీ ప‌ర‌మేశ్వరులు లాంటి సినిమాల్లో చేసిన పాత్రలతో విల‌న్ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌ప‌డి.. కుటుంబ ప్రేక్షకుల‌కు సత్యనారాయణ అభిమాన న‌టుడ‌య్యారు.

ఇవి కూడా చదవండి

1976లో దర్శకులు బాపు తీసిన సీతా స్వయంవర్ తో హిందీలో నటించిన సత్యనారాయణ….1977లో శ్రీరామ్ వనవాస్, 1986లో బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్, అనిల్ కపూర్, నసీరుద్దీన్ షాలతో కలిసి కర్మ సినిమాలో నటించారు. ఒక అశోక్‌కుమార్‌, ఒక సంజీవ్‌ కుమార్‌, ఒక శివాజీ గణేశన్ ముగ్గురూ కలిస్తే సత్యనారాయణ అని ఆ చిత్ర దర్శకుడు సుభాష్ ఘాయ్ సత్యనారాయణను ప్రశంసించటం భాషలతో సంబంధం లేని ఆయన నటనా కౌశలానికి మచ్చు తునక.