
అక్కినేని అందగాడు నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. కెరీర్ బిగినింగ్ నుంచి నాగ చైతన్య కథల ఎంపిక చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగ చైతన్య. ప్రస్తుతం వృషకర్మ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నాగ చైతన్య సినిమాల విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా నిత్యం వార్తల్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి.
నాగ చైతన్య ఇటీవలే శోభితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఫ్యామిలీకి టైం ఇస్తూనే.. సినిమాలు కూడా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కాగా తాజాగా నాగ చైతన్య సమంతను కలిశారు. అవును మీరు విన్నది నిజమే.. నాగ చైతన్య తాజాగా సమంతను కలిశారు. అయితే ఆమె మీరు అనుకునే సమంత కాదు. హీరోయిన్ సమంత, నాగ చైతన్య విడిపోయిన విషయం తెలిసిందే. ఇటు చై, అటు సామ్ విడిపోయిన తర్వాత మరొకరిని వివాహం చేసుకున్నారు.
తాజాగా నాగ చైతన్య కలిసిన సమంత ఎవరో కాదు.. శోభిత చెల్లి పేరు కూడా సమంతనే.. ఇటీవలే శోభితతో పాటు ఆమె చెల్లి సమంతను కలిశారు నాగ చైతన్య. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శోభిత చెల్లి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు.. ఆమె డాక్టర్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది సమంత. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.