తమిళనాట మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో శివకార్తికేయన్( Sivakarthikeyan) ఒకరు. ఈ టాలెంటెడ్ హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. శివకార్తికేయన్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా రెమో, డాక్టర్ వరుణ్ సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు శివ కార్తికేయన్. ఈ మధ్య వచ్చిన డాన్ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు స్టైట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శివ. జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు శివకార్తికేయన్. ఈ సినిమాకు ప్రిన్స్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది.
ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన బింబిలికి పిలాపి అనే పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తక్కువ టైం లోనే ఈ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు, అదే సమయంలో 10 లక్షలకు పైగా లైక్‌లను కూడా సాధించింది. ఈ పాటను తమిళ్ లో అనిరుధ్ రవిచందర్ ఆలపించగా తెలుగులో రామ్ మిరియాల , రమ్య బెహరా ఆలపించారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..