
సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా పరాశక్తి. పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రవి మోహన్ (జయం రవి), అధర్వ మురళి ప్రధాన పాత్రలు పోషించారు. టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన పరాశక్తి సినిమా మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. మొదట పాన్ ఇండియా రిలీజ్ అనుకున్న ఈ మూవీ వివిధ కారణాలతో కేవలం తమిళ్ వెర్షన్ లో మాత్రమే రిలీజైంది. థియేటర్ల కొరతతో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ కు నోచుకోలేకపోయింది. దీనికి తోడు పరాశక్తి సినిమాను వరుస వివాదాలు వెంటాడాయి. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, తదితర సంఘటనల ఆధారంగా పరాశక్తి సినిమాను తెరకెక్కించారు సుధ కొంగర. దీంతో మొదటి నుంచి ఈ సినిమా కంటెంట్ పై వివాదాలు చెలరేగాయి. ఇక మూవీ రిలీజయ్యాక ఆ నిరసనల వేడి మరింత పెరిగింది. పరాశక్తి సినిమాను బ్యాన్ చేయాలంటూ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కూడా చేసింది. అయినా ఇలా వివాదాలు చెలరేగినా, మిక్స్ డ్ టాక్ వచ్చినా పరాశక్తి సినిమాకు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని చిత్ర బృందం పేర్కొంది.
థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన పరాశక్తి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో పరాశక్తి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రావొచ్చని సమాచారం.
A roar heard across the world 💥#Parasakthi storms past the ₹100 CRORE mark worldwide 🌍
Now running successfully in theatres near you#ParasakthiPongal@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan @Atharvaamurali @gvprakash @DawnPicturesOff @redgiantmovies_… pic.twitter.com/HuJuUTOO3E
— DawnPictures (@DawnPicturesOff) January 20, 2026
కాగా ఇప్పటివరకూ గ్లామర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిన శ్రీలీల పరాశక్తిలో మాత్రం కాస్త యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది. పైగా తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లు కూడా సమాచారం. అయితే ఇక్కడ కూడా ఆమెను దురదృష్టం వెంటాడింది. పరాశక్తి సినిమా కేవలం తమిళంలో మాత్రమే రిలీజైంది. దీంతో తెలుగు ఆడియెన్స్ కు ఆమె యాక్టింగ్ చూసే అవకాశం దక్కలేదు. ఇక చివరకు సినిమాకు కూడా నెగెటివ్ టాక్ రావడంతో శ్రీలీల ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి పడింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..