టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాల హిట్స్ కొత్త ఊపిరిని పోస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన బింబిసార , సీతారామం, కార్తికేయ 2 సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటించింది. తొలి సినిమాతోనే మృణాల్ తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టేసింది. ఈ అమ్మడి నటన, అందం చూసిన ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. అంతే కాదు ఈ చిన్నదానికి తెలుగులో ఆఫర్లు క్యూకడుతున్నాయని తెలుస్తోంది. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తారక్ నెక్స్ట్ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా తర్వాత కొరటాల ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్. ఇక ఈ విషయం పై మృణాల్ స్పందిస్తూ.. తారక్ అంటే నాకు చాలా ఇష్టం.. ఆయనతో నటించాలని ఎదురుచూస్తున్నా..అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ ముద్దుగుమ్మ ఆశలు నెరవేరుతాయో లోదో చూడాలి. అటు మరో క్యూటీ జాన్వికపూర్ కూడా తారక్ తో కలిసి నటించడానికి ఎదురుచూస్తోంది. ఇటీవలే ఈ అమ్మడు తన మనసులో మాట చెప్పుకొచ్చింది. ఇప్పుడు మృణాల్ కూడా తారక్ తో నటించాలని ఉందనడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి