Sunitha: ‘అన్ని విషయాలు చెబితే బాగుంటుంది’.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత

ప్రముఖ గాయని సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ల గురించి యంగ్ సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ప్రోగ్రాంకు సంబంధించి వీరంతా తనను మానసికంగా వేధించారంటూ ఈ యంగ్ సింగర్ చేసిన కామెంట్స్ అందరినీ షాక్ కు గురి చేశాయి.

Sunitha: అన్ని విషయాలు చెబితే బాగుంటుంది.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
Pravasthi, Singer Sunitha

Updated on: Apr 22, 2025 | 6:33 PM

ప్రముఖ గాయని సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ గురించి వర్ధమాన సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమవుతోన్న ఓ పాటల ప్రోగ్రాంలో ఈ ముగ్గురు తనను మానసికంగా వేధించారని ప్రవస్తి ఆరోపించింది. సెట్లో తనను బాడీ షేమింగ్ చేశారని, వివక్ష చూపారంటూ ప్రవస్తి రిలీజ్ చేసిన వీడియో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. నట్టి కుమార్ లాంటి ప్రముఖులు ప్రవస్తికి మద్దతుగా నిలబడుతున్నారు. అదే సమయంలో సంగీత దిగ్గజాల గురించి ప్రవస్తి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.  తాజాగా ఇదే విషయంపై ప్రముఖ గాయని సునీత స్పందించారు. ప్రవస్తి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ‘ప్రవస్తి.. నిన్ను బాల్యంలో నేనూ ముద్దుచేశా. అలాగనీ ఈ వయసులో కూడా అలా చేస్తే బాగుండదు కదా. ఎవరు బాగా పాడినా మేం లీనమై భావోద్వేగానికి గురవుతుంటాం. ఆయా ఎపిసోడ్స్‌ నువ్వు చూడలేదనుకుంటా. మా గురించి చర్చించే స్థాయికి వెళ్లినందుకు అసంతృప్తిగా ఉంది. నువ్వు ఎన్నో పాటల పోటీల్లో పాల్గొన్నావు కదా అక్కడి ప్రాసెస్, నియమాలు, నిబంధనలు‌ ఎలా ఉంటాయో నీకు తెలియదా? మ్యూజిక్‌ విషయంలో ఛానల్స్‌కు కొన్ని పరిమితులుంటాయి. కొన్ని ఛానళ్లకు కొన్ని పాటలకే హక్కులుంటాయి. అన్ని పాటలూ పాడే అవకాశం ఉండదు ఆడియన్స్‌కు ఇలా అన్ని విషయాలు కూడా చెప్పు. అప్పుడు నిజంగా నేను సంతోషిస్తా’ అని సునీత చెప్పుకొచ్చారు.

కాగా ఈ పాపులర్ టీవీ షోకు గతంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జడ్జిగా ఉండేవారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్ సునీత, గేయ రచయిత చంద్రబోస్ న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. ఎంతో మంది యువ సింగర్స్ ఈ సింగింగ్ షోలో సత్తా చాటి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలాంటి టీవీ షోపై ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

సింగర్ సునీత షేర్ చేసిన వీడియో ఇదిగో..

కాగా ప్రవస్తి ఆరోపణలను ప్రముఖ సింగర్లు లిప్సిక, హారిక కూడా ఖండించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.