Tollywood: ప్రకృతిలో డ్యాన్స్ చేస్తూ సేదతీరుతున్న ఈ కోయిలమ్మ ఎవరో గుర్తించారా..?

|

Dec 25, 2021 | 9:15 PM

అందమైన ప్రకృతిలో ఆహ్లాందంగా డ్యాన్స్ చేస్తున్న ఈ కోయిలమ్మ ఎవరో గుర్తించారా..? కోయిలమ్మ ఎందుకు అన్నామంటే ఆమె గాత్రం అంత మదురంగా ఉంటుంది కాబట్టి.

Tollywood: ప్రకృతిలో డ్యాన్స్ చేస్తూ సేదతీరుతున్న ఈ కోయిలమ్మ ఎవరో గుర్తించారా..?
Tollywood Singer
Follow us on

పెళ్లి అనంతరం సింగర్ సునీత చాలా మారిపోయారు. అంతకుముందు ఈ సీనియర్ సింగర్ చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవారు. ఏవైనా మ్యూజికల్ ప్రొగ్రామ్స్‌ లేదా ఈవెంట్స్‌లో తప్ప బయట ఎక్కువగా కనిపించకపోయేవారు. సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్దగా అప్‌డేట్స్ ఏవీ ఉండేవి కాదు. కానీ ఆమె ఇప్పుడు సూపర్ యాక్టివ్ అయ్యారు. తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్, ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు. లైవ్స్‌కి వచ్చి తన ఫ్యాన్స్‌తో ఇంట్రాక్ట్ అవుతున్నారు. కాస్త మితిమీరి అతిగా కామెంట్లు చేసేవాళ్లకి కూడా తన మార్క్ కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన లైఫ్‌లో సామాజిక మాధ్యమాలకు ఎంత స్పేస్ ఇవ్వాలో  తెలుసని, తన వ్యక్తిగత జీవితాన్ని ఎంత వరకు ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే దానిపై క్లారిటీ ఉందని పేర్కొన్నారు. అందుకే తాను టూర్స్‌కు, వెకేషన్లకు ఎక్కడికైనా వెళ్తే.. వెంటనే ఫోటోలను షేర్ చేయనని.. వెకేషన్‌కు వెళ్లి వచ్చాక ఎప్పుడో అలా గుర్తుకు వచ్చినప్పుడు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా ఈ మధ్య ఇన్‌స్టా రీల్స్ కూడా చేస్తున్నారు ఈ పాటల కోయిలమ్మ. తాజాగా లెహరాయి సాంగ్‌కి హొయలు పోయారు. ఆ రీల్‌ను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.

ఈ ఏడాది జనవరిలో ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సింగర్‌ సునీత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరువురు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ పెళ్లి జరిగింది.  పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు సునీత.

Also Read:  వ్యాపారుల దోపిడి తాళలేక జామ రైతు ఈ పనిచేశాడు.. ఇప్పుడు డబుల్ ప్రాఫిట్

 కళ్లల్లో కారం కొట్టి చోరీ చేసేందుకు యత్నించాడు.. కానీ ప్లాన్ ఉల్టా అయ్యింది..