Guess The Celebrity: అరుదైన ఫొటో.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులు.. ఎవరో గుర్తుపట్టారా?

|

Jan 26, 2023 | 9:21 AM

ఇందులో ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులు ఉన్నారు. ఇద్దరి దారులు వేరైనా భారతీయ సంగీతానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో వీరిద్దరి ప్రముఖ పాత్ర పోషించారు. ఇంటర్నేషనల్‌ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందారు. హాలీవుడ్ స్థాయిలో ప్రశంసలు పొందారు.

Guess The Celebrity: అరుదైన ఫొటో.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులు.. ఎవరో గుర్తుపట్టారా?
Old Photo
Follow us on

ఒక సినిమా విజయంలో హీరో, హీరోయిన్లు, డైరెక్లర్లకు ఎంతటి ప్రాధాన్యముంటుందో సంగీత దర్శకులకు అంతే ప్రాధాన్యముంటుంది. పాటలు హిట్టైతే సినిమా సగం విజయం సాధించినట్లేనని సినీ ఇండస్ట్రీలో నమ్ముతారు. అందుకే డైరెక్టర్లు తమ కథలకు తగ్గట్టుగానే మ్యూజిక్‌ డైరెక్టర్లను ఎంచుకుంటారు. వారితో తమకు నచ్చిన బాణీలు, స్వరాలను రూపొందించుకుంటారు. కాగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంగీత దర్శకుల్లో చాలామంది కీబోర్డు ప్లేయర్లుగా ఎంట్రీ ఇచ్చిన వారే. ఫై ఫొటో కూడా ఈ కోవకు సంబంధించినదే. ఇందులో ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులు ఉన్నారు. ఇద్దరి దారులు వేరైనా భారతీయ సంగీతానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో వీరిద్దరి ప్రముఖ పాత్ర పోషించారు. ఇంటర్నేషనల్‌ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందారు. హాలీవుడ్ స్థాయిలో ప్రశంసలు పొందారు. ఇలా భారతీయ సంగీతానికి మూల స్తంభాలుగా నిలిచిన వారు ప్రస్తుతం కూడా వార్తల్లో ఉన్నారు. మరి వారెవరో గుర్తుపట్టారా?

ఫై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు ..ఎమ్ ఎమ్‌ కీరవాణి, ఏఆర్‌ రెహమాన్‌. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు సాంగ్‌ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న కీరవాణికి అభినందనలు తెలిపారు ప్రముఖ మలయాళ సింగర్‌ శ్రీకుమార్. ఈ సందర్భంగా ఆయనతో పని చేసిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఒక పాత ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆఫొటో ఎప్పుడు తీసిందో చెప్పలేదు. కానీ.. మద్రాస్ లోని ఏవీఎం స్టూడియోలో ఒక సినిమా కోసం లైవ్ రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు తీసిందని చెప్పారు. ‘ఫై ఫొటోని నిశీతంగా గమనించినట్లైతే.. మధ్యలో నిలబడి ఇన్స్ స్ట్రక్షన్స్ ఇస్తున్న వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ రాజమణి. అలాగే కీబోర్డు ప్లేయర్‌ ఏఆర్ రెహమాన్(ఎడమవైపు) కాగా, ఎర్రని పంచె కట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్ వెనుక అసిస్టెంట్‌గా ఉన్నది ఎంఎం కీరవాణి. ‘అప్పట్లో కీరవాణిని మరకతమణిగా పిలిచేవారు.. హిందీలో ఎంఎం క్రీమ్ గా పిలుచుకుంటారు. సో.. ఆయన ఇండియా నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం గర్వకారణం’ అంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు శ్రీకుమార్. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు సంగీత దర్శకులను ఒకే ఫ్రేమ్‌లో చూడడం సంతోషంగా ఉందంటున్నారు సంగీత ప్రియులు, నెటిజన్లు

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..