తెలంగాణ పల్లె పాటకు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం కల్పించిన రచయితలలో కందికొండ ఒకరు. ఇండస్ట్రీలో కందికొండ పాటలకు ఎంతో ఆదరణ ఉండేది. స్టార్ డైరెక్టర్స్ సైతం కందికొండ పాటలను అమితంగా ఇష్టపడేవారు.. మెలోడీ నుంచి మాస్ సాంగ్స్ వరకు కందికొండ పాటలు ఎంతో ఫేమస్. ఇంకా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కవి.. గేయ రచయిత కందికొండ పనిచేశారు. బతుకమ్మ పాటను బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్లిన రచయితలలో ఆయన కూడా ఒకరు. ఒకప్పుడు కందికొండ పాటంటే శ్రోతలు మైమరచిపోయేవారు.. సినిమా కంటే ఆయన పాటలను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పూరీ జగన్నాథ్ సినిమాలు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి వంటి సినిమాలకు పనిచేశారు. అలాంటి రచయిత కందికొండ ఇప్పుడు ప్రాణం కోసం పోరాడుతున్నారు. క్యాన్సర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
కందికొండను కాపాడుకుందాం అంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రయత్నిస్తున్నారు. కందికొండ చికిత్సకు ఆర్థికంగా కావాల్సిన సాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే కోన వెంకట్ వంటి ప్రముఖులు కందికొండకు సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.. ఈ క్రమంలో సింగర్ స్మిత.. కందికొండకు సాయం చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం పెరాలసిస్ తో బాధపడుతున్నారు కందికొండ. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమో థెరపీ చేయించుకోవడంతో.. కందికొండ స్పైనల్‌కార్డ్ లోని సీ1 సీ2 భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో కందికొండ నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. తొందరగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని కందికొండను పరీక్షించిన డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే చికిత్స కోసం 26 లక్షలు ఖర్చు పెట్టారు కందికొండ.
Also Read: Varudu Kavalenu Twitter Review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ.. నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే..
Romantic Twitter Review: అదుర్స్ అనిపించుకుంటున్న ఆకాశ్ పూరీ.. రొమాంటిక్ సినిమా ట్విట్టర్ రివ్యూ..
Bigg Boss 5 Telugu: శివాలెత్తిన యానీ మాస్టర్.. కత్తి అందుకున్న సిరి.. ఇదేం రచ్చ రా నాయనా..