Singer Mangli: జోహార్ మురళి నాయక్.. అమర వీరుడికి పాటతో నివాళి అర్పించిన మంగ్లీ.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు

‘ఆపరేషన్‌ సింధూర్‌’లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన పోరులో తెలుగుబిడ్డ మురళీనాయక్‌ వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గడ్డం తాండ పంచాయతీ కల్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ పాక్ సైనికులు జరిగిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Singer Mangli: జోహార్ మురళి నాయక్.. అమర వీరుడికి పాటతో నివాళి అర్పించిన మంగ్లీ.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు
Singer Mangli

Updated on: May 16, 2025 | 12:50 PM

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందాడు తెలుగు జవాన్ మురళీ నాయక్. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన అతను జమ్మూకశ్మీర్‌లోని ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబం తల్లడిల్లిపోయింది. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ మురళీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు అమర వీరుడికి నివాళి అర్పించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ కూడా మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొంది. జవాన్ కుటుంబానికి ధైర్యం చెప్పి ఓదార్చింది. మురళీ నాయక్ దేశంలోని ప్రతి మహిళ సింధూరంలో నిలిచి ఉంటాడని మంగ్లీ ఎమోషనల్ అయ్యింది. ఇప్పుడు ఆ అమర వీరుడికి నివాళి అర్పిస్తూ మంగ్లీ ఒక పాట పాడింది. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో మంగ్లీ పొందు పరిచింది.

‘సైన్యమై, సంకల్పంతో సాగినవా ఓ సైనికుడా.. తూటాల వర్షంలో తడిసినవా ఓ వీరుడా’ అంటూ సాంగే ఈ పాట యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించేలా ఆ సాంగ్‌ ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా మురళీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు, ఫొటోలను ఈ వీడియోలో మనం చూడొచ్చు.

‘దేశంలోని మహిళల సిందూరం కాపాడేందుకు మురళీ నాయక్ తన ప్రాణాలను అర్పించాడు. అతను దేశంలోని ప్రతి మహిళ సిందూరంలో నిలిచి ఉంటాడు. మహిళలు సిందూరం పెట్టుకునేటప్పుడు మురళీ నాయక్ వంటి జవాన్ల ప్రాణత్యాగాలను స్మరించుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలి’ అని మంగ్లీ కోరింది. మరి కన్నీళ్లు పెట్టిస్తోన్న మంగ్లీ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.