కమిట్మెంట్‌కు నో చెబితే ఛాన్స్‌లు ఇవ్వరు.. చిరంజీవి కామెంట్స్‌పై చిన్మయి రియాక్షన్

మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై సింగర్ చిన్మయి స్పందించారు. ఇటీవల చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్నిఅందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో మెగాస్టార్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అని కామెంట్స్ చేశారు.

కమిట్మెంట్‌కు నో చెబితే ఛాన్స్‌లు ఇవ్వరు.. చిరంజీవి కామెంట్స్‌పై చిన్మయి రియాక్షన్
Chiranjeevi,chinmayi

Updated on: Jan 27, 2026 | 9:48 AM

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకరవర ప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరున్న అనిల్ రావిపూడి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనేది లేదని, పరిశ్రమ అద్దం లాంటిదని చిరంజీవిఅన్నారు . ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. మెగాస్టార్ కామెంట్స్ పై సింగర్ చిన్మయి స్పందించారు. కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలను విభేదించారు సింగర్ చిన్మయి. ఫిల్మ్ ఇండస్ట్రీ మిర్రర్ లాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి విభేదిస్తున్నట్టు తెలిపారు చిన్మయి. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్స్ షేర్ చేశారు. అలాగే క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఉదాహరణలు కూడా ఆమె తెలుపుతూ ట్వీట్స్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య. కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరు. చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు. ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు. లిరిసిస్ట్ వైరముత్తు నన్ను వేధించాడు. వేధించమని నేనడగలేదు. అతను నన్ను వేధించేటప్పుడు పక్కనే అతని తల్లి కూడా ఉంది. తల్లి పక్కనే ఉన్నా మగవారి బుద్ధి మారదు. ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా సె*క్స్ కోరుకుంటారు. అలాంటి పురుషుల ఆలోచనా ధోరణే పెద్ద సమస్య అంటూ ట్విట్ చేశారు చిన్మయి. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..