బాలీవుడ్ సింగర్ ఆదిత్య నారాయణ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. అభిమానులతో ఆయన ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. నిజానికి ఆదిత్య తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. ఆయన పాడిన పాటల కంటే ఎక్కువగా ఆయన చేసిన కామెంట్స్.. ప్రవర్తనపై చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆదిత్య పై నెటిజన్స్ మండిపడుతున్నారు. వరస్ట్ బిహేవియర్ ఆదిత్య.. ఇలా చేసి ఉండాల్సింది కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే ఓ మ్యూజికల్ ఈవెంట్లో పాల్గొన్న ఈ సింగర్.. అక్కడే ఉన్న ఓ అభిమానిని కొట్టి అతడి ఫోను లాక్కొని విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో అతడి ప్రవర్తనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సాధారణంగా సింగర్స్ మ్యూజికల్ ఈవెంట్లలో పాల్గొనడం.. మ్యూజిక్ షోస్ ఇవ్వడం కొత్తేమి కాదు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల గాయకులు సంగీత కచేరీలలో తమ అభిమానులతో కలిసి ఎంతో ఉత్సాహంగా సాంగ్స్ ఆలపిస్తుంటారు. అయితే తమ అభిమాన గాయకులను ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి పోటీ పడుతుంటారు ఫ్యాన్స్.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని ఓ కళాశాలలో ఆదిత్య నారాయణ్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అతడి అభిమానులు… సంగీత ప్రియులు భారీగా తరలివచ్చారు. షారూఖ్ ఖాన్ నటించిన ‘డాన్’ చిత్రంలోని ‘ఆజ్ కీ రాత్..’ పాటను పాడుతుండగా.. అభిమానులంతా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. అభిమానుల మధ్యలో స్టేజ్ పై అటు ఇటు తిరుగుతుండగా.. అక్కడే ఉన్న ఫ్యాన్స్ అతడిని ఫోటోస్, వీడియోస్ తీస్తున్నారు. అదే సమయంలో ఓ అభిమాని తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీస్తుండగా.. ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు ఆదిత్య. వెంటనే అతడి చేతిపై కొట్టి ఫోన్ లాక్కొని దూరంగా ప్రజలపైకి విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
ఆదిత్య ప్రవర్తనపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదిత్యకి అంత కోపం ఎందుకు? ఇలా అమర్యాదగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు? అతను మీ అభిమాని. వారికి గౌరవం ఇవ్వండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘అభిమానులు రాకపోతే స్టేజ్ షో ఎలా ఇస్తారు ? అంటూ విమర్శిస్తున్నారు. ఆదిత్య ఇలా వివాదాల్లో కూరుకుపోవడం ఇదే మొదటిసారి కాదు. 2017లో రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో సిబ్బందితో గొడవ పడ్డాడు. ఎయిర్‌పోర్టు సిబ్బందితో అతడు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి ఆదిత్య తీరుపై విమర్శలు వస్తున్నాయి.
What the f is wrong with Aditya Narayan🙄?
So arrogant and for what? 👀
Disrespectful towards his own fans💀? pic.twitter.com/BE1817boQ0— A̴.̴ (@andjustsmile_) February 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.