పదేళ్ళ కింద వచ్చిన హీరోయిన్ల మొహాలే ప్రేక్షకులకు గుర్తుండటం లేదు. కానీ చనిపోయి 26 ఏళ్లైనా.. ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో అలాగే ఉండిపోయారు సిల్క్ స్మిత. హీరోయిన్ కాకపోయినా.. వాళ్లకు మించి ఇమేజ్ తెచ్చుకున్నారీమె. చనిపోయి రెండున్నర దశాబ్ధాలైనా.. ఈ రోజుకీ సిల్క్ పేరన్నా.. జీవితం అయినా సంచలనమే. తాజాగా ఆమె ఇమేజ్‌ను నాని కూడా వాడుకుంటున్నారు. సిల్క్ స్మిత.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. పాతికేళ్ళ కింద ఈ పేరు వింటే ఇండియా షేక్ అయిపోయేది. చనిపోయి పాతికేళ్లు దాటినా.. ఇప్పటికీ సిల్క్ పేరు చెప్తే స్క్రీన్ ఊగిపోతుంది. అది ఆమె కున్న క్రేజ్. కేవలం సినిమాలో స్పెషల్ సాంగ్స్‌తోనే సిల్క్ స్మిత తెచ్చుకున్న గుర్తింపు గురించి మాటల్లో చెప్పడం సాధ్యమే కాదు. 2011లో వచ్చిన ఈమె బయోపిక్ డర్టీ పిక్చర్ అప్పట్లోనే 100 కోట్లు వసూలు చేసింది.
స్మిత చనిపోయిన 15 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా డర్టీ పిక్చర్ మామూలు సెన్సేషన్ కాలేదు. విద్యా బాలన్‌కు ఏకంగా నేషనల్ అవార్డ్ వచ్చింది. ఈమె జీవితంపై డర్టీ పిక్చర్ మాత్రమే కాదు.. మరో రెండు బయోపిక్స్ వచ్చాయి. అయితే కమర్షియల్‌గా అవి ఆడకపోవడంతో ప్రపంచానికి తెలియకుండా పోయాయి. మలయాళంలో సనా ఖాన్ హీరోయిన్‌గా క్లైమాక్స్.. కన్నడలో పాకిస్తానీ నటి వీణా మాలిక్‌తోనూ ఓ డర్టీ పిక్చర్ చేసారు.
తాజాగా నాని సైతం సిల్క్ స్మిత ఇమేజ్ వాడుకుంటున్నారు. ఈయన హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న దసరా సినిమాలో సిల్క్ అభిమానిగా నటిస్తున్నారు నాని. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బ్యాగ్రౌండ్‌లో సిల్క్ స్మిత ఫోటోనే హైలైట్ చేసారు. అలాగే ధూమ్ ధామ్ దోస్తానా పాటలోనూ సిల్క్ స్మితను బాగానే చూపించారు మేకర్స్. డిసెంబర్ 2న ఈమె జయంతి సందర్భంగా పోస్టర్ విడుదల చేసారు. మొత్తానికి ఇన్నేళ్ళ తర్వాత కూడా సిల్క్ స్మిత ట్రెండింగ్‌లోనే ఉన్నారు.
Team #Dasara remembers and celebrates the heartthrob of generations and the ever mesmerizing #SilkSmitha on her birth anniversary ❤️
Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/hvq3Ket4Pu
— SLV Cinemas (@SLVCinemasOffl) December 2, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.