Tillu Square Collections: టిల్లు స్వ్కేర్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. వారం రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..
గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ పార్టులో సిద్ధూ జొన్నలగడ్డ.. నేహా శెట్టి జంటగా నటించగా.. సెకండ్ పార్టులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించించింది. ఈ మూవీ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంస్ ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మించాయి.
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి హడావిడి కనిపిస్తుంది. మొన్నటి వరకు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయగా.. ఇప్పుడు టిల్లు స్వ్కేర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. గత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రికార్డుల వేట కొనసాగిస్తుంది టిల్లు స్క్వేర్. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. మొదటి రోజే రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. నాలుగు రోజుల్లోనే రూ. 85 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఆరు రోజుల్లో రూ. 91 కోట్లు వసూలు చేసింది. వారం రోజులుగా సూపర్ హిట్ టాక్ తో టిల్లుగాడు కుమ్మేస్తున్నాడు. ఈ సినిమా ఈజీగా రూ. 100 కోట్లు రాబడుతుందని మొదటి రోజే చెప్పేశాడు నిర్మాత నాగవంశీ. ఇక ఇప్పుడు అదే మాటను నిజం చేస్తూ దూసుకుపోతున్నాడు టిల్లుగాడు. మొత్తం 7 రోజుల్లో రూ. 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది టిల్లు స్క్వేర్. ఇక ఈరోజుతో కచ్చితంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. మొత్తానికి ఫస్ట్ డేనే చెప్పి మరీ కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు టిల్లు .
ఈరోజు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ నటించింది. మొదటి నుంచే పాజిటివ్ బజ్ నెలకొన్న ఈ సినిమాకు ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ అటు టిల్లు స్క్వేర్ సినిమా కలెక్షన్స్ కు మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ రెండు చిత్రాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.
గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ పార్టులో సిద్ధూ జొన్నలగడ్డ.. నేహా శెట్టి జంటగా నటించగా.. సెకండ్ పార్టులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించించింది. ఈ మూవీ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంస్ ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మించాయి. ఇక త్వరలోనే ఈ సితనిమాకు సీక్వెల్ టిల్లు క్యూబ్ స్టార్ట్ చేయనున్నారు. మరీ ఇందులో సిద్ధుతో జోడి కట్టనున్న హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ మాత్రం నెలకొంది.
#TilluSquare grosses over 𝟗𝟒 𝐂𝐑 𝐢𝐧 𝟕 𝐃𝐚𝐲𝐬, All set to have a BLOCKBUSTER 2nd week on cards!💥
Racing towards 𝟏𝟎𝟎𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 mark!! 🔥😎
Our Starboy 🌟 shattering records all over! 🤘
– https://t.co/vEd8ktSAEW pic.twitter.com/GpqlnV4og3
— Sithara Entertainments (@SitharaEnts) April 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.