Tollywood: పాన్ ఇండియాలోనే టాప్ హీరోయిన్.. యూత్ అభిమానించే అందాల తార.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఓవైపు నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ పర్సనల్ విషయాలపై నిత్యం ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. తన గురించి ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోనని.. కేవలం తన ఫోకస్ సినిమాలపైనే అంటూ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: పాన్ ఇండియాలోనే టాప్ హీరోయిన్.. యూత్ అభిమానించే అందాల తార.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 05, 2024 | 4:38 PM

ప్రస్తుతం భారతీయ సినీ ప్రపంచంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్. కన్నడ సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించిన ఈ చిన్నారి ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఓవైపు నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ పర్సనల్ విషయాలపై నిత్యం ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. తన గురించి ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోనని.. కేవలం తన ఫోకస్ సినిమాలపైనే అంటూ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే రష్మిక చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తున్నారు.

ఏప్రిల్ 5న కర్ణాటకలోని కోటక్ జిల్లా విరాజ్‌పేటలో జన్మించింది. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో రష్మికకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన.. విజయ్ దేవరకొండ సరసన నటించిన గీతా గోవిందం మూవీతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఈమూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది.

పుష్ప తర్వాత రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ క్యూ కట్టాయి. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ నార్త్ అడియన్స్ ను ఆకట్టుకుంది. ఇటీవల వచ్చిన యానిమల్ సినిమా ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్. ఇందులో గీతాంజలి పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమె రేర్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?