Siddharth: అలాంటి సినిమాలు చేస్తే ఎప్పుడో స్టార్ అయ్యేవాడిని.. సిద్ధార్థ్ సంచలన కామెంట్స్..

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్. ఎన్నో అందమైన ప్రేమకథలతో యూత్ ఫేవరేట్ హీరోగా మారాడు. కొన్నేళ్ల క్రితం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత అతడు నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఈ హీరోకు తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి.

Siddharth: అలాంటి సినిమాలు చేస్తే ఎప్పుడో స్టార్ అయ్యేవాడిని.. సిద్ధార్థ్ సంచలన కామెంట్స్..
Siddharth

Updated on: Jan 30, 2025 | 4:56 PM

దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరో. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమైన సిద్ధార్థ్.. ప్రేమకథ చిత్రాలతోపాటు విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. కానీ కొన్నాళ్లుగా సిద్ధార్థ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో అతడికి ఆఫర్స్ తగ్గిపోయాయి. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అటు హీరోగా తన సినిమాల్లో నటిస్తూనే.. స్టార్ హీరో సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. అయితే తాజాగా ‘హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌’లో సిద్ధార్థ్‌ సినీ పరిశ్రమలోని పలు అంశాల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఈ వేడుకకు సిద్ధార్థ్ భార్య అదితి రావ్ హైదరీ తల్లి, ప్రముఖ గాయని, రచయిత విద్యారావు కూడా హాజరయ్యారు. ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య జరిగిన చర్చ పురుషాధిక్యత అంశం వైపు మళ్లింది. నెగెటివ్ పురుషాధిక్యతని హైలైట్ చేసే పాత్రలను నేరుగా తిరస్కరిస్తున్నట్లు సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.

‘నేను స్త్రీల చెవుల కింద వాయించడం.. పాటలు పాడడం స్త్రీ నడుముపై చిటికెలు వేయడం.. స్త్రీకి ఏమి చేయాలో.. ఎక్కడికి వెళ్లాలో చెప్పే స్క్రిప్టులు నా దగ్గర ఉన్నాయి. అలాంటి స్క్రిప్టులను నేను నేరుగా రిజెక్ట్ చేశాను. నాకు ఆ నేచర్ లేకపోతే, అలాంటి సినిమాలు నేను చేసి ఉంటే ఈపాటికి పెద్ద స్టార్ హీరోను అయ్యేవాడని. కానీ నేను ఎక్కువగా నేను ఇష్టపడే దానిపై దృష్టి పెట్టాను. నా దగ్గరకు వచ్చిన ఆడవాళ్లతో నేను గౌరవంగా ఉండేవాడిని, తల్లిదండ్రులతో బాగానే ఉండేవాడిని. పిల్లలతో బాగానే ఉండేవాడిని, అది నన్ను క్యూట్‌గా చూపించిందని చెబుతుంటారు. 15 ఏళ్ల క్రితం నా సినిమాలను వాళ్ల పిల్లలు చూడగలరు. ఫీలింగ్ చాలా సంతృప్తికరంగా ఉంది’ అని అన్నారు.

‘కోట్లు సంపాదించడంలో నేను లెక్కించలేని ఈ అనుభూతిని, నా చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి నన్ను దూకుడుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నాకు తెరపై ఏడవడం చాలా ఇష్టం.’ అని అన్నారు. గత 20 ఏళ్లల్లో ఎన్నో సినిమాలు రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..