Siddharth: హీరోయిన్‌తో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్.. ఎట్టకేలకు స్పందించిన సిద్ధార్థ్.. ఏమన్నారంటే..
ఇటీవలే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందని న్యూస్ వినిపించింది. తెలంగాణలోని వనపర్తిలో ఉన్న శ్రీరంగనాయక ఆలయంలో ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోస్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న సమయంలో వీరిద్దరు తమకు నిశ్చితార్థం జరిగిందంటూ వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్. నువ్వోస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్ వంటి ప్రేమకథ చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అనుహ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత మహాసముద్రం సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్…ఇప్పుడు సహాయ నటుడిగానూ రాణిస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా సిద్ధార్థ్ పేరు నిత్యం వార్తలలో నిలుస్తుంది. చాలా రోజులుగా హీరోయిన్ అదితితో ప్రేమలో ఉన్నారనే టాక్ నడిచింది. అయితే తమ ప్రేమ గురించి వస్తున్న రూమర్స్ పై వీరిద్దరు స్పందించలేదు. ఇటీవలే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందని న్యూస్ వినిపించింది. తెలంగాణలోని వనపర్తిలో ఉన్న శ్రీరంగనాయక ఆలయంలో ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోస్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న సమయంలో వీరిద్దరు తమకు నిశ్చితార్థం జరిగిందంటూ వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఓ అవార్డ్ వేడుకలో పాల్గొన్న సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “మేము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సీక్రెట్, ప్రైవేట్ ఈ రెండు పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. మా నిశ్చితార్థానికి ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే దీనిని సీక్రెట్ వేడుక అని భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే మాది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్. కానీ ఇది సినిమా షూటింగ్ కాదు నేను నిర్ణయించడానికి. ఇది లైఫ్ టైమ్ డేట్. కేవలం పెద్దల నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. వాళ్లు ఎప్పుడు ఎక్కడ జరగాలనుకుంటే అక్కడే జరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే మీ ప్రపోజల్ ను అంగీకరించడానికి అదితి ఎన్ని రోజుల సమయం తీసుకున్నారు ? అని అడగ్గా… సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “ఈ ప్రశ్నలు నన్ను అడగొద్దు… ఎందుకంటే నాకు ఎస్ లేదా నో అనే రిజల్ట్ మాత్రమే ముఖ్యం. నేను ప్రపోజ్ చేయగానే ఆమె ఎస్ చెబుతుందా ?లేదా ? అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆమె అంగీకరించింది” అని అన్నారు. వీరిద్దరు కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. ఇందులో శర్వానంద్ సైతం హీరోగా అలరించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




