8 ఏళ్ల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా.. సిద్దార్థ్ భావోద్వేగం

సిద్దార్థ్ తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యాడు. ఎందుకో తెలియదు కానీ గత కొన్నేళ్లుగా అతడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలు చెయ్యడం లేదు.

  • Ram Naramaneni
  • Publish Date - 8:53 pm, Fri, 30 October 20
8 ఏళ్ల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా.. సిద్దార్థ్ భావోద్వేగం

సిద్దార్థ్ తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యాడు. ఎందుకో తెలియదు కానీ గత కొన్నేళ్లుగా అతడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలు చెయ్యడం లేదు. పక్కింటి కుర్రాడిలా కనిపించే సిద్దూకు ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే చాలా ఏళ్ల తర్వాత  ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న మహాసముద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు  సిద్దార్థ్. శర్వానంద్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ స్టార్టవ్వనుంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు సిద్దార్థ్.

“దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగు చిత్రంలో నటిసున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు తెలుగులో మళ్లీ అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను. ఓ గొప్ప టీమ్‌తో వర్క్ చేసేందుకు ఎదురుచూస్తున్నాను” అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు సిద్దార్థ్.

 

Also Read :

“మన తెలుగమ్మాయి బ్రదర్, అక్కున చేర్చుకోండి”

Breaking : టర్కీలో భారీ భూకంపం, అల్లకల్లోలం !