కాజల్ అగర్వాల్ పెళ్లి అయిపోయింది..ఫోటో వైరల్
చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి అయిపోయింది. గౌతమ్ కిచ్లూతో ఆమె ఏడడుగులు వేసింది. దశాబ్దం పాటు సౌత్ ప్రేక్షకులు అలరించిన పంచదార బొమ్మ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది.

చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి అయిపోయింది. గౌతమ్ కిచ్లూతో ఆమె ఏడడుగులు వేసింది. దశాబ్దం పాటు సౌత్ ప్రేక్షకులు అలరించిన పంచదార బొమ్మ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రేమ గురించి రివీల్ చేసిన నెలలోపే పెళ్లిని ముగించేసింది కాజల్. అక్టోబర్ 30 శుక్రవారం ఆమె తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడింది. కాజల్ పెళ్లి అనంతరం బయటకు వచ్చిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటో చూసి కాజల్ ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఆమెను కలల సుందరిగా ఫీలయ్యే యువకులు మాత్రం కాస్త బాధలో ఉన్నారు. అయితే పెళ్లికి ముందు జరిగిన ఫంక్షన్లలో చాలా ఆనందంగా కనిపించింది కాజల్. తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టింది. తాజా ఫోటోలో భర్త పక్కన చాలా కూల్ మోడ్‌లో కాజల్ కనిపిస్తోంది.
Also Read :
“మన తెలుగమ్మాయి బ్రదర్, అక్కున చేర్చుకోండి”
8 ఏళ్ల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా.. సిద్దార్థ్ భావోద్వేగం