Siddharth New Movie: ‘బిచ్చగాడు’ డైరెక్టర్‌తో చేతులు కలిపిన సిద్ధార్థ్.. ‘ఒరేయ్ బామ్మర్ది’ అంటూ..
Siddharth New Movie Orey Bamardhi: 'బొమ్మరిల్లు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు హీరో సిద్ధార్థ్. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న సిద్ధార్థ్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా..
Siddharth New Movie Orey Bamardhi: ‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు హీరో సిద్ధార్థ్. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న సిద్ధార్థ్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈ ఒక్క సినిమాతో లేడీ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడీ హీరో. అనంతరం ‘ఆట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘బావ’ వంటి వరుస సినిమాలతో తెలుగు హీరోగా మారాడీ తమిళ స్టార్. ఇక ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాతో తెలుగులో పెద్దగా కనిపించడం లేదు సిద్ధార్థ్. పూర్తిగా తమిళ సినిమాలకే పరిమితం అయ్యాడు. కనీసం డబ్బింగ్ రూపంలో కూడా సిద్ధార్థ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు సిద్ధార్థ్. ఇందుకోసం ‘బిచ్చగాడు’ సినిమా దర్శకుడు శశితో చేతులు కలుపుతున్నాడు. సిద్ధార్థ్, జీవీ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్‌లు హీరోయిన్‌లు నటిస్తున్నారు. ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తమిళంలో ‘శివప్పు మంజల్ పచాయ్’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో తెరకెక్కుతోంది. ఇక చిత్రంలో సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్‌లు ఒకరికి మించి ఒకరు పోటీ చేస్తారని తెలుస్తోంది. వీరి కాంబినేషనల్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.
Also Read: Vakeel Saab pre release event live: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తుతున్న శిల్పకళావేదిక
Tollywood Senior Heros: ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’.. లుక్స్, గ్రేస్ విషయంలో అదే ఫామ్‌లో సీనియర్స్
Saipallavi Nithin: నితిన్‌తో జోడి కట్టనున్న హైబ్రిడ్ పిల్లా..? ఈసారైనా సాయి పల్లవి ఒప్పుకుంటుందా..!